విలియమ్సన్ నన్ను క్షమించు: బెన్ స్టోక్స్

Submitted on 15 July 2019
Will Be Apologising To Kane Williamson, Says Ben Stokes

ఇంగ్లాండ్ వరల్డ్ కప్ సాధించింది. జట్టు సమష్టి కృషి కప్పు గెలిచేలా చేసినా బెన్ స్టోక్స్ ప్రదర్శన మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. 4వికెట్లు నష్టపోయాక బరిలోకి దిగిన ఈ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ చెలరేగిపోయాడు. వికెట్లు పడుతున్నా క్రీజులో పాతుకుపోయి చివరి బంతి వరకూ పోరాడి జట్టును గెలిపించాడు. 
Also Read : చరిత్రలో తొలిసారి: ప్రపంచ విజేతను నిర్ణయించిన బౌండరీలు

కానీ, చివరి ఓవర్లో రెండు పరుగులు చేయాలనే ఉద్దేశ్యంతో స్టోక్స్ క్రీజులో పరిగెడుతున్నాడు. ఈ క్రమంలో మార్టిన్ గఫ్తిల్‌కు అతని బ్యాట్ గట్టిగా తగలింది. ఈ క్రమంలో అతను బంతి మిస్ చేశాడు. ఫలితంగా ఎక్స్‌ట్రా 4పరుగులు ఇంగ్లాండ్‌కు వచ్చాయి. ఇంగ్లాండ్ విజయం తర్వాత స్టోక్స్ ఈ విషయంపై మాట్లాడాడు. 

'వరల్డ్ ఛాంపియన్స్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇదొక అద్భుతమైన ఫీలింగ్. న్యూజిలాండ్‌పై ఆడిన మ్యాచ్ గుర్తుండిపోతుంది. కానీ, నేను జీవితకాలం విలియమ్సన్‌కు క్షమాపణ చెప్పాల్సి ఉంటుంది. ఇది ముందే రాసి ఉంది కాబట్టి జరిగింది' అని స్టోక్స్ చెప్పుకొచ్చాడు. 
Also Read : వరసగా మూడవసారి: వరల్డ్ కప్ సెంటిమెంట్ వర్క్ఔట్ అయ్యింది

kane williamson
ben stokes
2019 icc world cup
world cup 2019

మరిన్ని వార్తలు