పిల్లలు పుట్టడం లేదని : భార్యను గృహ నిర్బంధం చేసిన భర్త 

Submitted on 11 February 2019
Wife house arrest by his husband in kadapa

కడప : జిల్లాలో అమానుషం చోటుచేసుకుంది. పిల్లలు పుట్టడం లేదని భార్యను గృహ నిర్బంధం చేశాడో ఓ భర్త. కడప జిల్లాలో నివాసముంటున్న గౌసియాకు ఇరవై ఏళ్ల క్రితం ఓ వ్యక్తితో వివాహం జరిగింది. ఆమెకు పిల్లలు పట్టకపోవడంతో భర్త మరో వివాహం కూడా చేసుకున్నాడు. తన మొదటి భార్య గురించి ఎవ్వరికీ తెలియకూడదని బూత్‌ బంగ్లా లాంటి ఇంట్లో ఒంటరిగా బంధించాడు. భర్త బంధించడంతో గతకొద్ది రోజులుగా  ఆమె చీకటి జీవితం అనుభవిస్తోంది.

విషయం తెలుసుకున్న గౌసియా కుటుంబ సభ్యులు మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. రంగ ప్రవేశం చేసిన అధికారులు ఆమె భర్తను అదుపులోకి తీసుకుని, పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారించి చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. 
 

Wife house arrest
husband
kadapa
another marriage

మరిన్ని వార్తలు