వైడ్ యాంగిల్

Tuesday, January 23, 2018 - 20:34
Thursday, January 18, 2018 - 20:39

ఎట్టకేలకు పద్మావత్ సినిమా విడుదలకు అడ్డంకులు తొలగాయి. కొన్ని రాష్ట్రాలు సినిమా విధించిన నిషేధంపై సుప్రీం కోర్టు సీరియస్ గా స్పందించింది. మీ ఇష్టం వచ్చిన్నట్టు చేస్తే కుదరదని సుప్రీం స్పష్టం చేసింది. అయితే కర్ణిసేన మాత్రం టికెట్లు కొని అయిన సినిమా నిలుపుదల చేస్తామని ప్రకటించింది. 

Wednesday, January 17, 2018 - 20:41

నీ స్నేహితులెవరో తెలిస్తే నువ్వేంటో చెప్పొచ్చంటారు.. మరి మనదేశానికి స్నేహితులెవరు?మనం ప్రపంచానికి ఏ సంకేతాలిస్తున్నాం..? ఇరుగు పొరుగు దేశాలను దూరం చేసుకుని, ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలని భావించే దేశానికి దగ్గరయ్యే ఆరాటం.. ఆ అగ్రరాజ్యానికి పావులా మారిన ఓ కిరాయి గూండాలాంటి దేశంతో ఇప్పుడు కొత్త స్నేహం.. మరి ఈ స్నేహాలు ఏ లక్ష్యం కోసం? ఈ అడుగులు ఏ గమ్యం వైపు? ఈ కావలింతలకు...

Friday, January 12, 2018 - 20:26

మొత్తానికి కలిశారు.. కలిశారు. సరే.. దీనివల్ల ప్రయోజనమేంటి? ఏపీకి ఏం ఒరుగుతోంది? మూడున్నరేళ్లుగా విభజన తర్వాత అనేక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చిందేంటి? రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని నిలదీయలేని రాష్ట్ర ప్రభుత్వం.., పైగా ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ల నోళ్లు నొక్కే రాష్ట్ర ప్రభుత్వం... ఏపీలో కనిపిస్తున్న తరుణం. ఇప్పుడు ఏడాది తర్వాత మోడీని కలిసిన చంద్రబాబు...

Thursday, January 11, 2018 - 20:21

గేట్లెత్తేశారు..తలుపులు బార్లా తెరిచారు..రావటానికి పోవటానికి ఎలాంటి అడకడంకులు లేకుండా చేసేశారు. దీని ఫలితం ఎలా ఉండబోతోంది? రిటెయిల్ రంగంపై ఇది చావుదెబ్బ కొట్టుందా? మన ఎయిర్ ఇండియాపై విదేశీ శక్తులు పట్టు బిగిస్తాయా? విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారి తీయనుంది ? ఈ అంశంపై టెన్ టివి ప్రత్యేక కథనం… ఓడమల్లన్న బోడిమల్లన్న సామెతను...

Wednesday, January 10, 2018 - 20:57

సంక్షుభిత సమయాలు పరిష్కారాలకోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తాయి. అణచివేత ఆకాశాన్నంటితే పాతాళాన్ని చీల్చుకుంటూ కత్తుల చేతులు, నిప్పుల స్వరాలూ దూసుకొస్తాయి. వివక్షను బోధించిన విలువలతో దేశాన్ని అధోగతి పాల్జేస్తామంటే నిజమైన దేశభక్తి అంటే ఏంటో కొత్త పాఠాలు మొదలవుతాయి. పరిష్కారాల దిశగా దూసుకెళ్లే పావన నవజీవన బృందావన నిర్మాతలుగా కొందరు నవయువకులు తెరపైకివస్తారు.. ప్రభుత్వాలు...

Friday, January 5, 2018 - 21:56

హం హై వీర్‌,  శూర్‌ – హం తోడే జంజీర్‌! ప్రపంచంమంతా జనవరి ఒకటి ఉత్సవాల్లో మునిగిన సమయంలో మహారాష్ట్రలో ఈ నినాదాలు నింగినంటాయి. తరతరాల పీడనను ధిక్కరిస్తూ, అసమానతలను, అణచివేతలను ప్రతిఘటిస్తూ పోటెత్తిన మహాజనసంద్రం నింగి దద్దరిల్లేలా ఇచ్చిన నినాదం అది. కానీ, ఆ సంస్మరణపై కొందరు విరుచుకు పడ్డారు. దాడులు చేశారు. అది జాతి వ్యతిరేకమన్నారు. ఎందుకు? అసలు కోరేగావ్ లో ఏం జరిగింది? అది...

Wednesday, January 3, 2018 - 20:39

సమాజం చిమ్మ చీకట్లో మగ్గే కాలంలో వెలుగు వైపు నడిపించే క్రాంతదర్శి కావాలి..బానిస సంకెళ్లు పట్టి పీడించే కాలంలో వాటిని తెగ్గొట్టే ధీరులు కావాలి.. స్త్రీలోకాన్ని దురాచారాలు అణచివేసే కాలంలో ధైర్యంగా తలెత్తి చూసే యోధురాలు కావాలి.. అక్షర జ్ఞానం అందని కాలంలో బతుకులో వెలుగు నింపే ఉపాధ్యాయురాలు కావాలి. అలా మన చదువుల తల్లి.. మెరిసిన మొదటి అక్షరం.. మన చదువుల దేవత.. ఈ దేశ మహిళలకు,...

Tuesday, January 2, 2018 - 20:55

నా దారి రహదారి.. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తా... దేవుడు శాసిస్తాడు.. నేను చేస్తాను..ఇవన్నీ రజనీ దశాబ్దాలుగా చెప్తున్న మాటలు. ఇప్పుడు మాటలనుంచి చేతల సమయం వచ్చింది. పొలిటికల్ ఎంట్రీ ప్రకటనతో ఒక్కసారిగా తమిళ రాజకీయాల్లో కలకలం రేగింది. ఎన్నాళ్లో వేచిన ఉదయం అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. మరి తమిళ రాజకీయాల్లో రజనీ ఎలాంటి ప్రభావం చూపిస్తారు.సూపర్ స్టార్ రజనీకాంత్.......

Monday, January 1, 2018 - 20:55

కేలండర్ మారింది. కొత్త సంవత్సరం వచ్చేసింది. కాలం శరవేగంగా మారుతోంది. కాలంతోపాటే టెక్నాలజీ కూడా పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. ప్రపంచాన్ని ముంచేస్తోంది. రోబోలు నట్టింట్లో తిష్టవేస్తాయి. వర్చువల్ క్లాస్ రూమ్ లు అడుగడుగునా కనిపిస్తాయి. పొలాలు ఇళ్లపైకెక్కుతాయి. డ్రైవర్ లేకుండానే కార్లు షికార్లు కొడతాయి. తలెత్తిచూస్తే డ్రోన్లు విచ్చలవిడిగా విహారం చేస్తుంటాయి. కంప్యూటర్లు,...

Friday, December 29, 2017 - 21:53

హిట్టనుకున్నారు.. ఫట్టయింది. చిన్న సినిమా అనుకున్నారు.. కలెక్షన్లలో భారీ అని రుజువయింది. ఆ హీరో కథ ముగిసింది అనుకున్నారు..కాదు.. మళ్లీ మొదలయిందని తేలింది.కసిపెట్టి తీశారు.. ప్రేక్షకులు నెత్తిన పెట్టుకున్నారు...టాక్ నెగెటివ్ గా వినపడింది.. కలెక్షన్లు పాజిటివ్ గా వచ్చాయి.. ఇదీ సింపుల్ గా తెలుగు సినిమాకు 2017 మిగిల్చిన గుర్తులు.. ఇదే ఈ రోజు వైడాంగిల్ స్టోరీ.. 2017లో రెండు...

Thursday, December 28, 2017 - 20:21

ఆకాశాన్నంటుతున్న ధరలు.. భారమైపోయిన సామాన్యుడి బతుకు... హక్కుల కోసం ఉద్యమాలు.. అస్థిత్వం కాపాడుకునే ఆరాటం.. ప్రజల బాగోగులు చివరి ప్రాధాన్యతగా పెట్టుకున్న ప్రభుత్వాలు.. పైపై మెరుగులు తప్ప సామాన్యుడి బతుకును నిర్లక్ష్యం చేసే విధానాలు..దళితులపై పెరుగుతున్న దాడులు.. పరువు కోసం హత్యలు...విదేశీ సదస్సుల ఆడంబరాలు... పరిమళించిన తెలుగు ఉత్సవాలు.. పరుగులెత్తుతున్న మెట్రో రైలు,...

Wednesday, December 27, 2017 - 20:49

ఈ సంవత్సరంలో ఏడు రాష్ర్టాల్లో ఎన్నికలు జరగడం, శశికళ జైలు వెళ్లాడం, లాలూ జైలు వెళ్లాడం, దేశ ఆర్థిక వ్యవస్థ నష్టపోవడం, జీఎస్టీ అమలు పై రివైండ్ 2017. గత సంవత్సంర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు దేశ ఆర్థిక వ్యవస్థనే క్షిణించింది. గుజరాత్ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ స్వల్ప తేడా గెలిచింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

Tuesday, December 26, 2017 - 21:19

మా ఉద్యోగాలు మావే. అంతా లోకలే. ఎక్కడైనా గ్లోబల్ కానీ, ఉద్యోగాల దగ్గర మాత్రం కుదరదు..అంటోంది అమెరికా..  పెట్టుబడుల ప్రవాహానికి అడ్డుకట్ట ఉండకూడదన్నారు. ఇష్టారాజ్యంగా ప్రపంచంలో ఎక్కడైనా పెట్టుబడులు పెట్టి, లాభాలు తరలించుకుంటున్నారు. ఇప్పుడు ఉద్యోగాల వరకు వచ్చేసరికి లోకల్ లోకల్ అంటూ కొత్త రూల్స్ తీసుకొస్తున్నారు. ఇది ఆయా దేశాలకు సంబంధించిన సొంత విషయంగా కనిపిస్తున్నప్పటికీ,...

Monday, December 25, 2017 - 20:43

కాలచక్రం గిర్రున తిరిగింది. కేలండర్ లో చివరి పేజీల్లో ఉన్నాం. సంవత్సరకాలంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక పరిణామాలు, ప్రమాదాలు, ప్రమోదాలు... కుట్రలతో ప్రపంచాన్ని మభ్య పెట్టి, నిఘాలతో తన ప్రయోజనాలు కాపాడుకునే దౌర్భాగ్యం ఒకరిది. కాళ్లకింద నేలను నిలబెట్టుకోవాలనే ఆరాటం మరోపక్క.., ఎగసిన నినాదాలు.., బిగిసిన పిడికిళ్లు, రాజకీయ చదరంగంలో ఎత్తులకు పై ఎత్తులు.., ప్రకృతి శాపానికి, విలయ...

Tuesday, December 19, 2017 - 20:54

గెలవటమైతే గెలిచారు.. కానీ, గెలిచిన ఆనందం లేకుండా పోతున్న తరుణం.. మసకబారుతున్న ప్రభ.. వరుసగా తగ్గుతున్న సీట్లు..ఓట్ల శాతం.. క్రమంగా లైట్ తీసుకుంటున్న గుజరాత్ ప్రజలు.. గుజరాత్ మోడల్ అంటూ ఊదరగొడుతున్న మాటల్లో డొల్లతనం.. ఆఖరికి మతం, జాతీయత లాంటి ఎమోషనల్ ఎలిమెంట్స్ వాడితే తప్ప ప్రయోజనం సాధించలేనితనం.. ముగ్గురు యువకులను చూసి వణికిపోయిన పరిస్థితి. ఇవన్నీ చూస్తే గుజరాత్ ఎన్నికల్లో...

Monday, December 18, 2017 - 20:44

గుజరాత్ ఎన్నికల ఫలితాలు బీజెపీ గుండెల్లో గుబులు రేపుతున్నాయా? చావుతప్పి కన్ను లొట్టపోయినట్టయిందా? గెలిచిన సంతోషం ఆస్వాదించలేని పరిస్థితిలో ఉందా? కాంగ్రెస్ కాస్త వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉంటే, బీజెపీని బోల్తాకొట్టించగలిగేదా? గుజరాత్ ఫలితాలు ఏం చెప్తున్నాయి? మోడీ మంత్రకు, అమిత్ షా వ్యూహానికి కాలం చెల్లుతున్న ఆనవాళ్లు గుజరాత్ ఫలితాలతో స్పష్టమౌతున్నాయా? ఈ అంశంపై ప్రత్యేక కథనం...

Thursday, December 14, 2017 - 20:17

ఆల్రెడీ రేషన్ షాపులు అంతంత మాత్రంగా మారాయి? వాటిని గాలికొదిలి మాల్స్ పేరుతో కొత్త దోపిడీకి తెరలేపుతున్నారా? ప్రజాపంపిణీ వ్యవస్థ నుంచి ప్రభుత్వం సైడవ్వాలని చూస్తోందా? తక్కువ ధరలకే ఇస్తామంటూ మొదటికే మోసం తీసుకురానుందా? రిలయన్స్ లాంటి బడా సంస్థలు సామాన్యులకు తక్కువ ధరలకు ఎందుకిస్తాయి? రూపాయి పెట్టుబడి లేకుండా.. కోట్లు దండుకునే ఎత్తుగడా ఇది? చంద్రన్న మాల్స్ గుట్టేంటి? ఇదే ఈ...

Wednesday, December 13, 2017 - 20:57

పాట కదిలిస్తుంది.. పరుగులు పెట్టిస్తుంది.. ప్రవహించేలా చేస్తుంది...భాషలో మాటకెంత ప్రాధాన్యం ఉందో.. పాటకు అంతకంటే ఎక్కువే ఉందని చెప్పాలి. ముఖ్యంగా తెలుగు గడ్డపై జరిగిన అనేకానేక ఉద్యమాల్లో ప్రజల కోసం గొంతెత్తిన పాట సాధించిన విజయం అసామాన్యం. అది తెలంగాణ సాయుధ పోరాటమైనా, విప్లవోద్యమమైనా, ప్రత్యేక తెలంగాణ ఉద్యమమైనా ఏ సందర్భంలో అయినా తెలుగు పాట దగద్ధగమంటూ వెలిగింది. ఉద్యమ...

Tuesday, December 12, 2017 - 20:41

మీ సొమ్ముకు భరోసా పోతోందా? భద్రంగా బ్యాంకుల్లో ఉందనుకున్న సొమ్ము ఏ రాత్రో చడీ చప్పుడు కాకుండా గుటుక్కుమంటుందా? బ్యాంకులు ఏ మాత్రం నమ్మకాన్ని ఇవ్వటానికి రెడీగా లేవా? ఇప్పటికే జీఎస్టీ, నోట్ల రద్దు.. అంటూ ప్రయోగాలు చేసిన మోడీ సర్కారు.. ఐఎఫ్ డి ఆర్ బిల్లుతో బ్యాకింగ్ రంగాన్ని సామాన్యులకు ఉపయోగపడని విధంగా, అపనమ్మకంగా మార్చే ప్రమాదం ఉందా. ప్రపంచం ఏ స్థాయిలో ఆర్ధిక ఒడిదుడుకులను...

Monday, December 11, 2017 - 20:28

సవాళ్లు కావలసినన్ని ఉన్నాయి.. కళ్లముందే గుజరాత్ ఎన్నికలు.. ఇంకాస్త ముందుకెళితే పలు రాష్ట్రాల ఎన్నికలతో పాటు, 2019 సార్వత్రిక ఎన్నికలు సిద్ధంగానే ఉన్నాయి. వీటితో పాటు..నిన్న మొన్నటి పార్టీ వైఫల్యాలు వెంటాడుతూ ఉంటే, పార్టీ కేడర్ ఎక్స్ పెక్టేషన్స్ మాత్రం భారీగా ఉన్నాయి. తరుణంలో పార్టీ పగ్గాలు చేపట్టాడు రాహుల్ గాంధీ.. మరి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని పరుగులు తీయిస్తారా......

Wednesday, December 6, 2017 - 20:37

ఎవడిసొమ్ము ఎవడికి దానం చేస్తున్నారు ? అడ్డూ అదుపు లేకుండా ప్రైవేటు పరం చేస్తూ.. బ్రహ్మాండమైన లాభాలతో దూసుకుపోతున్న సంస్థ వాటాలు ఎలా అమ్మేస్తారు? యావత్ జాతి సమిష్టి ఆస్తిని ఏ ప్రయోజనాలతో నిర్వీర్యం చేస్తున్నారు. ఇవే ఆ కార్మికుల ప్రశ్నలు. ఇంకాలం పోరాటాలు, నిరసనలు సాగాయి. కానీ ఇప్పుడు ప్రాణత్యాగం జరగటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పట్ల...

Tuesday, December 5, 2017 - 20:43

రోగమొస్తే మందేసుకుంటాం.. కానీ, లేని రోగానికి మింగితే... కొత్త రోగాలొస్తాయి. మందుల కంపెనీల దృష్టిలో వాళ్లు ప్రయోగశాలలో జంతువులతో సమానం. అడ్డగోలుగా చేస్తున్న ప్రయోగాలే ఇందుకు ఉదాహరణ. నిస్సహాయతను, అజ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని డ్రగ్స్ కంపెనీలు సాగిస్తున్న ఆగడాలకు చెక్ పెట్టేదెలా? దళారులతో ఎరవేస్తూ ప్రాణాలను బలితీసుకుంటున్న దారుణాన్ని ప్రభుత్వాలు ఎంత కాలం చూస్తూ ఊరుకుంటాయి? ఇదే ఈ...

Monday, December 4, 2017 - 20:26

మన ఉద్యోగాలు..మనవే..నినాదాలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి..అంకె భారీగా ఊరిస్తూనే ఉంది.. అమలుపైనే అసలు సందేహాలు..ఓ పక్క సమర్ధింపులు.. మరోపక్క కొట్లాటలు..మూడున్నరేళ్లు గడుస్తుంది.. ఇంకెప్పుడని రోడ్డెక్కుతున్నారు.. ఆందోళనకు దిగుతున్నారు.. తెలంగాణలో నిరుద్యోగులకు ఒరిగిందేమిటి? లక్షల ఉద్యోగాలంటూ ప్రభుత్వం చెప్పేది కాకి లెక్కలేనా? నిరుద్యోగుల ఆశలు నెరవేరేదెపుడు? కొలువుల కొట్లాట ఏ...

Friday, December 1, 2017 - 20:43

ఆ రాష్ట్రాలే ఎందుకు దళితులపై దాడుల్లో ముందున్నాయి..? ఆ రాష్ట్రాలే ఎందుకు మహిళలపై దాడుల్లో ముందున్నాయి? ఏ దన్ను చూసుకుని చెలరేగిపోతున్నారు? ఏ అండతో ఈ దాడులు సాగిస్తున్నారు? నేషనల్ క్రైమ్ రికార్డ్స్ జాబితా ఆలస్యంగా ఎందుకు రిలీజ్ అయింది? క్రూరంగా ఘోరంగా సాగుతున్న నేరాల తీరుపై ప్రత్యేక కథనం.. ఆలస్యంగా ఎందుకు విడుదల చేశారు? భయపడ్డారా? ఎన్నికల్లో ఈ చిట్టా ప్రభావితం చేస్తుందని...

Thursday, November 30, 2017 - 20:24

మామూలుగా గాలి పీల్చక పోతే చస్తారు.. కానీ, ఇక్కడ గాలి పీల్చినందుకు చస్తున్నారు..ఇది మామూలు గాలి కాదు.. ఊపిరితిత్తులను రోజుకింత కొరుక్కు తినేస్తోంది. ఇది ఏ ఒక్క ప్రదేశానికో, నగరానికో పరిమితం కాదు.. దేశంలోని పెద్ద పెద్ద నగరాలనుంచి, చిన్న స్థాయి పట్టణాల వరకు ఇదే పరిస్థితి. ఒక్కమాటలో చెప్పాలంటే వాయు కాలుష్యం అంతులేకుండా పెరుగుతోంది. ప్రాణాంతకంగా మారుతోంది. ఈ అంశంపై ప్రత్యేక కథనం...

Wednesday, November 29, 2017 - 20:48

నీలం రంగు నీటితో స్వచ్ఛంగా మెరిసే సంద్రాలు కావవి.. కాలుష్య కాసారాలు.. ఒక్కకమాటలలో చెప్పాలంటే  స్వచ్ఛ సముద్రాలు కాదు.. చెత్త సముద్రాలు.. కిలోమీటర్ల ఎత్తు పేరుకుంటున్న ప్లాస్టిక్ తో కడలి గర్భం డంప్ యార్డ్ లా మారుతోంది. ఈ ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యకు పరిష్కారం లేదా? సమస్త జల చరాలూ అంతమౌతుంటే చూస్తూ ఉండాల్సిందేనా?  ఇదే ఈ రోజు వైడాంగిల్ స్టోరీ.. 
తప్పొకరిది శిక్ష...

Pages

Don't Miss