Twitterకు గుడ్‌బై : Mastodonకు ఇండియన్ యూజర్లు

Submitted on 8 November 2019
Why are thousands of Indian Twitter users moving to Mastodon?

ప్రముఖ సోషల్ మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ ట్విట్టర్‌కు ఇండియన్ యూజర్లు గుడ్ బై చెబుతున్నారు. ట్విట్టర్ వినియోగంలో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ మరో కొత్త ప్లాట్ ఫాంకు మైగ్రేట్ అవుతున్నారు. రోజురోజుకీ ట్విట్టర్ నుంచి కొత్త ఓపెన్ సోర్స్ ప్లాట్ ఫాం Mastodonకు భారీగా మైగ్రేట్ అవుతున్నారు. వీరీలో భారతీయ యూజర్లే ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టు ఓ నివేదిక వెల్లడించింది. ఎంతో పాపులర్ అయిన ట్విట్టర్ నుంచి మరో ప్లాట్ ఫాంకు ఎందుకు యూజర్లంతా మైగ్రేట్ అవుతున్నారంటే అసలు కారణం.. ట్విట్టర్ పాలసీలే ప్రధానంగా చెప్పవచ్చు. ట్విట్టర్ పాలసీతో ఇండియన్ యూజర్లు అసంతృప్తి చెందుతున్నారు. 

అంతేకాదు.. వెరిఫికేషన్ల పేరుతో యూజర్ల అకౌంట్లను సస్పెండ్ చేస్తూ ట్విట్టర్ తెగ ఇబ్బంది పెడుతోంది. గడిచిన కొన్ని వారాల్లో ట్విట్టర్ పాలసీల కారణంగా ఎంతోమంది యూజర్ల అకౌంట్లు సస్పెండ్ అయ్యాయి. యూజర్ల విషయంలో ట్విట్టర్ ప్రజాస్వామికంగా వ్యవహరించడం లేదని ఆరోపిస్తున్నారు. సుప్రీంకోర్టు లాయర్ సంజయ్ హెగ్డే ట్విట్టర్ అకౌంటు రెండుసార్లు సస్పెన్షన్ కావడం పెద్ద ఇష్యూ అయింది. సున్నితమైన కంటెంట్ లేదా అసభ్యకరమైన రీతిలో పోస్టులు ఉన్నాయని ఆరోపిస్తూ, ఇది ట్విట్టర్ నిబంధనలకు ఉల్లంఘించడమేనని ఆయన అకౌంట్ సస్పెండ్ చేసింది. 

ఒక ఫొటో విషయంలో ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్ చేసింది. ఒక పద్యాన్ని రీట్వీట్ చేయడంతో రెండోసారి సస్పెండ్ చేసింది. ఇలా చాలామంది ట్విట్టర్ యూజర్లు తమ అకౌంట్లను కోల్పోవాల్సి వచ్చింది. దీనిపై ట్విట్టర్ కూడా స్పందిస్తూ.. రాజకీయపరమైన పోస్టుల్లో నిష్పక్షపాతంగా ఉండే పోస్టులపై ఎలాంటి చర్యలు ఉండబోవని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ట్విట్టర్ వైఖరితో చిరెత్రుకొచ్చిన ఇండియన్ యూజర్లు.. ట్విట్టర్ కు స్వస్తిచెప్పాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. 

ట్విట్టర్ మాదిరిగా ఉండే మరో ఉచితమైన ఓపెన్ సోర్స్ సోషల్ నెట్ వర్క్ సర్వీసు Mastodonలో కొత్త అకౌంట్ తెరుస్తున్నారు. ఈ సర్వీసును ఒక నెట్ వర్క్ లేదా కంపెనీ కంట్రోల్ చేయదు. ఇందులో యూజర్లు తమకు నచ్చిన విధంగా స్వేచ్ఛగా కమ్యూనికేట్ అయ్యేందుకు వీలుగా ఉంటుంది. అందుకే ట్విట్టర్ పై ఆగ్రహంతో ఎక్కువ మంది యూజర్లు ఈ కొత్త ప్లాట్ ఫాంకు మైగ్రేట్ అవుతున్నారు. ఈ Mastodon ప్లాట్ ఫాంపై ఇప్పటికే 2.2 మిలియన్ల మంది యూజర్లు యాక్టివ్ గా ఉన్నారు. 

Twitter.. Mastodonకు తేడా ఏంటి? 
* మాస్టోడాన్ అనేది ఒక ఉచితమైన ఓపెన్ సోర్స్ సోషల్ నెట్ వర్కింగ్ ప్లాట్ ఫాం.
* జర్మన్ కోడర్ య్యుజెన్ రోచ్కో 2016లో ఈ సర్వీసును క్రియేట్ చేశారు. 
* ట్విట్టర్, ఫేస్ బుక్ మాదిరిగానే ఇది కూడా ఒక హోస్టెడ్ సర్వర్.
* ఒకే సంస్థ ఈ హోస్టెడ్ సర్వర్ తో కనెక్ట్ అయి కంట్రోల్ చేస్తుంటుంది.
* యూజర్లు తమ సొంత సర్వర్లను క్రియేట్ చేసుకునేందుకు అనుమతి ఇస్తుంది.
* సొంత సర్వర్లుతో పాటు సొంత కమ్యూనిటీలను క్రియేట్ చేసుకోవచ్చు.
* ట్విట్టర్ లేదా ఫేస్ బుక్ ద్వారా యూజర్ ప్రొఫైల్ క్రియేట్ చేసి డేటా షేర్ చేస్తారు.
* ఇతర యూజర్లతో ఇంటరాక్ట్ అవుతారు.. ట్విట్టర్ లేదా ఫేస్ బుక్ అకౌంట్ తప్పక ఉండాలి.   
* వీటిపై యూజర్లు నిబంధనలు ఫాలో అవ్వాలి లేదంటే అకౌంట్లపై ఆంక్షలు విధిస్తారు.
* FB, Twitter మాదిరిగా Mastodon ప్లాట్ ఫాం ఉండదు. డీసెంట్రలైజ్ చేసి ఉంటుంది. 
*  ఎవరైనా Mastodonలో తమ సొంత సర్వర్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. 
* మాస్టోడాన్.. ఏ ఒక కంపెనీ లేదా సంస్థకు చెందినది కాదు.
* క్రియేట్ చేసిన ప్రతి సర్వర్‌లో యూజర్‌కు మాత్రమే సొంత రూల్స్ ఉంటాయి.
* ప్రతి కొత్త సర్వర్ (వెర్షన్) మాస్టోడాన్.. Instanceగా పిలుస్తారు.

Mastodon ఎలా పనిచేస్తుంది.. లాగిన్ ప్రాసెస్ ఇదే :
* Mastodonలో Sign Up అవసరం. (ఫేస్ బుక్, ట్విట్టర్ మాదిరిగానే)
* ఈమెయిల్ ఐడీ, ఒక యూజర్ నేమ్, పాస్ వర్డ్ అవసరం.
* యూజర్లు తమ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. 
* ఇతర యూజర్లను ఫాలో అవ్వొచ్చు.
* పోస్టు మెసేజ్‌లు, వీడియోలు, ఇమేజ్ లు పంపవచ్చు.
* మాస్టోడాన్ లేఔట్.. ట్విట్టర్ మాదిరిగానే ఉంటుంది.
* మాస్టోడాన్ లో ఒక్కో మెసేజ్ పరిమితి 500 క్యారెక్టర్లు ఉంటుంది.
* ట్విట్టర్ లో ట్వీట్.. మాస్టోడాన్ లో TooT అని ఉంటుంది. 
* యూజర్లతో ఇంటరాక్ట్ అయితే.. Federated అనే బటన్ పై క్లిక్ చేస్తే చాలు.. 
* ఈ బటన్ మెనూలో రైట్ సైడ్ లో ఉంటుంది.
* ట్విట్టర్ లో రెండు ఆప్షన్లు ఉంటాయి. 
* ఒకటి ఫుల్లీ ప్రొటెక్టడ్ అకౌంట్ లేదా ఫుల్లీ పబ్లిక్ అకౌంట్
* మాస్టోడాన్ ఎన్నిసార్లు అయిన కస్టమైజ్ చేసుకోవచ్చు.
* ఫాలోయింగ్ ఫీచర్.. ట్విట్టర్ మాదిరిగానే మాస్టోడాన్ లో ఉంటుంది.
* కానీ, ఒకరిని ఫాలో అయితే మరొకరిని మీరు యాడ్ చేయలేరు. 
* ఈ ఫాలోయింగ్ జాబితా వ్యక్తిగతం.. పబ్లిక్ కాదు.

Anti-abuse పాలసీలు :
* మాస్టోడాన్ కూడా యాంటీ అబ్యూస్ టూల్స్ ఆఫర్ చేస్తోంది.
* instance యూజర్లు, కమ్యూనిటీలను మోడరేట్ చేసుకోవచ్చు.
* ట్విట్టర్ లానే మాస్టోడాన్ లో ఒక పెద్ద ప్రయోజనం ఉంది. 
* ఒక్కో సర్వర్ కు ఒక్కో అడ్మిన్ ఉంటుంది. ఒక మోడరేషన్ టీమ్ ఉంటుంది.
* మీ సర్వర్ మోడరేషన్ టీమ్.. ఒక అడ్మిన్ లేదా మల్టీపుల్ పీపుల్ ఉండొచ్చు.

Indian Twitter users
Mastodon
Twitter
Sanjay Hegde

మరిన్ని వార్తలు