ఫుల్ ప్రొటెక్ట్: మీ వాట్సప్ మెసేజ్.. మరొకరు చూడలేరు!

Submitted on 9 January 2019
WhatsApp Working on Fingerprint Authentication for Chats on Android

ఫేస్ బుక్ ఆధారిత ప్రముఖ మెసేజింగ్ ఆన్ లైన్ సంస్థ వాట్సప్ లో మరో కొత్త ఫీచర్ రానుంది. ఈ ఫీచర్ ఉంటే చాలు.. ఇకపై మీ అనుమతి లేకుండా మీ వాట్సప్ ను మరొకరు ఓపెన్ చేయలేరు. వాట్సప్ చాట్ లోని సందేశాలను కూడా చూడలేరు. అంతేకాదు.. కనీసం వాట్సప్ కూడా ఓపెన్ కాదు. అదంతా కేవలం మీ సింగిల్ ఫింగర్ ఫ్రింట్ తో కంట్రోల్ చేయవచ్చు. వాట్సప్ ప్రైవసీ సెట్టింగ్స్ లో ఈ ఫీచర్ ను త్వరలో ప్రవేశపెట్టనున్నారు. ఈ ఫింగర్ ఫ్రింట్ ఫీచర్.. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్నట్టు వాట్సప్ సంస్థ డబ్ల్యూఏబీఇన్ఫో ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆండ్రాయిడ్ 2.19.3 బీటా వెర్షన్ లో ఈ ఫీచర్ డిజేబుల్డ్ చేసినట్టు తెలిపింది. తొలుత ఈ ఫీచర్ డెవలప్ మెంట్ ప్రాసెస్ ను ఐఓఎస్ ఫోన్లలో ఫేస్ ఐడీ, టచ్ ఐడీ ఫీచర్లపై టెస్టు చేశారు. చివరికి వాట్సప్ ఆండ్రాయిడ్ ఫోన్లపై ఫింగర్ ఫ్రింట్ అథెంటికేషన్‌ ఫీచర్ ను డెవలప్ చేయాలని నిర్ణయించినట్టు ఓ నివేదిక వెల్లడించింది. ఈ ఫింగర్ ఫ్రింట్ అథెంటికేషన్‌ ఫీచర్.. వాట్సప్ సెట్టింగ్స్ లోని అకౌంట్ ప్రైవసీ సెట్టింగ్స్ లో ఆప్షన్ ఉంటుందని తెలిపింది.

టెస్టింగ్ దశలో.. భవిష్యత్తులో మీకోసం.. 
ఫింగర్ ఫ్రింట్ ఫీచర్ ను ఒకసారి ఎనేబుల్ చేస్తే చాలు.. మీ వాట్సప్ పూర్తిగా మీ కంట్రోల్లోకి వస్తుంది. మీ ఫింగర్ ఫ్రింట్ పెడితే తప్ప అది ఓపెన్ కాదు. ఇతరులకు అసలు ఓపెన్ కాదు. మెసేజ్ లు సైతం చూడలేరు. ఇప్పటికే మీ ఫోన్ అథెంటికేషన్‌ మెథడ్ ఉండి ఉండొచ్చు. అది సరిపోదు. ఈ ఫింగర్ ఫ్రింట్ అథంటికేషన్ తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే వాట్సప్ మొత్తానికి పూర్తి భద్రత కల్పించే అవకాశం ఉంటుంది. వాట్సప్ లో అథెంటికేషన్‌ చేయడానికి ముందు యాప్ ఐకాన్ పై క్లిక్ చేయాలి. ప్రైవసీ సెట్టింగ్స్ లో అథెంటికేషన్‌ ఆప్షన్ ఎనేబుల్ చేయాలి. అక్కడ ఓ కన్ ఫ్రిమ్ మెసేజ్ వస్తుంది. మీ ఫింగర్ తో టచ్ చేసి డివైజ్ క్రెడిన్షియల్స్ ధృవీకరించాల్సి ఉంటుంది. అంతే.. ఇక మీ వాట్సప్ ఫుల్ ప్రొటెక్టడ్ అయినట్టే. టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ భవిష్యత్తులో ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఆ తరువాత ఐఓఎస్ యూజర్లకు వస్తుందని నివేదిక వెల్లడించింది.  
Watsapp, Finger print

WhatsApp
Fingerprint Authentication
Android
WABetaInfo    

మరిన్ని వార్తలు