ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్ : వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ 

Submitted on 24 May 2019
WhatsApp rolls out sticker notification on Android smartphones

ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్. ఫేస్ బుక్ సొంత యాప్ వాట్సాప్ మెసేంజర్ మరో కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. అదే.. స్టిక్కర్ నోటిఫికేషన్. WhatsApp బీటా వెర్షన్ Android స్మార్ట్ ఫోన్లలో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇటీవలే వాట్సాప్.. స్టిక్కర్ నోటిఫికేషన్ ఫీచర్ ను ఐఫోన్ (iOS) Beta Version App యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది.

WABteaInfo నివేదిక ప్రకారం.. వాట్సాప్ బీటా ఆండ్రాయిడ్ వెర్షన్ 2.19.152 అప్ డేట్ పై Sticker notification ఫీచర్ ను అధికారికంగా ఎనేబుల్ చేసింది. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. రెగ్యులర్ వాట్సాప్ లో కూడా సాధ్యమైనంత త్వరగా ఈ కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టనుంది. 

స్టిక్కర్ నోటిఫికేషన్ ఫీచర్ అప్ డేట్ చేసుకున్న యూజర్లకు వాట్సాప్.. ఒక హార్ట్ ఎమోజీని నోటిఫికేషన్ బార్ లో డిస్ ప్లే చేస్తుంది. వాట్సాప్ బీటా యాప్ లో ఏదైనా Sticker notification రాగానే డిస్ ప్లే అవుతుంది. నిజానికి యూజర్ల ఆండ్రాయిడ్, ఐఫోన్ వాట్సాప్ లో హార్ట్ ఎమోజీకి బదులుగా నోటిఫికేషన్ బార్ లో స్టిక్కర్ మాత్రమే కనిపిస్తుంది.

ఈ కొత్త ఫీచర్ ద్వారా.. మీ వాట్సాప్ కు వచ్చిన నోటిఫికేషన్ మెసేజ్ ను యాప్ ఓపెన్ చేయగలదా? రెస్పాండ్ అవుతుందా? లేదా తెలుసుకోవచ్చు. Sticker notification ఫీచర్.. మీ స్టిక్కర్ కన్వరేజేషన్స్ ను సులభతరం చేస్తుంది. పూర్తి పదాలతో ఎమోజీలు, స్టిక్కర్లతో చాట్ చేసుకునేందుకు వీలుంది. 

మరోవైపు.. WhatsApp బ్రాండ్ న్యూ ఫీచర్ ను తమ ప్లాట్ ఫాంపై ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ యూజర్లు.. తమ వాట్సాప్ స్టేటస్ ను Facebook పై స్టోరీస్ గా షేర్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ వాట్సాప్ బీటా ఆండ్రాయిడ్ వెర్షన్ 2.19.151 తో అందుబాటులోకి రానుంది. యాడ్ టూ ఫేస్ బుక్ స్టోరీ ఆప్షన్ ట్యాప్ చేసుకోవచ్చు. మై స్టేటస్ సెలక్షన్ యాప్ కింద ఈ ఆప్షన్ కనిపిస్తుంది. 

WhatsApp
Sticker notification
Android smartphones
Android
iOS
WABteaInfo
Facbook Stories 

మరిన్ని వార్తలు