వాట్సప్ డౌన్... గంటకు పైగా యూజర్ల అవస్థలు 

Submitted on 19 January 2020
whatsapp down users unable to send stickers photos videos media files

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ వినియోగ దారులు ఆదివారం సాయంత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  IOS , ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సప్ డౌన్ అయ్యింది.  యూజర్లు వీడియోలు, ఫొటోలు, స్టిక్కర్లు, GIF ఫైళ్లు లాంటివి  ఫార్వర్ట్ చేసినా అవి అవతలివారికి చేరలేదు. కానీ ఆ సమయంలో టెక్ట్స్ మెసేజ్ లు మాత్రం యధావిధిగా పని చేశాయి. వాట్సాప్‌ పనిచేయకపోవడంతో యూజర్లు మెసేజ్‌లు పంపడం, రిసీవ్‌ చేసుకోవడంలో  సాంకేతిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ట్రాకింగ్‌ వెబ్‌సైట్‌ డౌన్‌డిటెక్టర్‌ వెల్లడించింది. 

ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అవతలి వారకి చేరకపోవటంతో యూజర్లు అసహనంతో ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. సాయంత్రం గం. 4-15 నుంచి  సుమారు ఒకగంట పాటు వాట్సప్ మొరాయించింది. ఆఖరికి స్టేటస్ లో వీడియోలు, ఫొటోలు కూడా చూసే అవకాశం లేకుండా పోయిందని యూజర్లు ఫిర్యాదు చేశారు. 2020 వ సంవత్సరంలో వాట్సప్ పనిచేయకపోవటం ఇదే మొదటి సారి.

వాట్సాప్‌ డౌన్‌ కావడంతో ఇండియా, యూరప్‌, మలేషియా, ఇండోనేషియా, బ్రెజిల్‌ తో సహా పలు దేశాల యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఔటేజ్‌ మ్యాప్‌లో కనిపించింది. వాట్సాప్‌ డౌన్‌ కావడంతో యూజర్లు ట్విటర్‌ సేవలను ఉపయోగించుకున్నారు. ఆ సమయంలో ట్విటర్‌ ఇండియాలో వాట్సాప్‌డౌన్‌ హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అయింది. యూజర్ల నుంచి వెల్లువెత్తిన ఫిర్యాదులతో వాట్సప్  యాజమాన్య సంస్ధ ఫేస్ బుక్ ఆ సమస్యను ఒక గంటలో పరిష్కరించింది. 

Smart Phone
whats app
SHUTDOWN
messaging app
Twitter
Facebook

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు