ఆ యూజర్లకు మాత్రమే : వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ 

Submitted on 22 May 2019
WhatsApp beta update adds Night Mode Feature for Users

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ సొంత యాప్ వాట్సాప్ మెసేంజర్ యాప్.. యూజర్ల కోసం ఎప్పటికప్పుడూ కొత్త అప్ డేట్స్ రిలీజ్ చేస్తోంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లను ఆకట్టుకునేందుకు వాట్సాప్ లేటెస్ట్ ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఇప్పుడు.. బీటా వెర్షన్ యూజర్ల కోసం వాట్సాప్ మరో లేటెస్ట్ అప్ డేట్ తీసుకొచ్చింది. వాట్సాప్ బీటా న్యూ వెర్షన్ (v2.19.145)లో నైట్ మోడ్ (Night Mode) ఫీచర్ తీసుకొచ్చింది.

కొన్నిరోజులుగా అదృశ్యమైన ‘డార్క్ మోడ్’ ఫీచర్.. ఆండ్రాయిడ్ బీటా అప్ డేట్ వెర్షన్ 2.19.139 లో మళ్లీ డబ్ల్యూఏబీటాఇన్ఫో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త అప్ డేట్ ను డార్క్ మోడ్ పేరుతో రిలీజ్ చేసింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు.. చాట్స్ లిస్ట్, కాల్స్, స్టేటస్ చెక్ చేసుకునేందుకు పనిచేస్తుంది. 

ఇకపై వాట్సాప్ బీటా వెర్షన్ లో యూజర్ కాంటాక్ట్ ప్రొఫైల్స్, గ్రూపు సెట్టింగ్స్ లో వర్క్ అవుతుంది. దీని యాక్షన్ బటన్స్ గ్రీన్ కలర్ లో కనిపిస్తాయి. కానీ, ఈ ఫీచర్ పూర్తిగా అందుబాటులోకి వచ్చాక.. గ్రీన్ కలర్ ను.. వైట్ కలర్ లోకి వాట్సాప్ మార్చనుంది. WABetaInfo ప్రకారం.. ప్రస్తుతం బీటా వెర్షన్ లో ఈ ఫీచర్ ఇంకా ఎనేబుల్డ్ కాలేదు. ప్రస్తుతానికి కోడ్ రూపంలో మాత్రమే కనిపిస్తుంది. కానీ, యాప్ సెట్టింగ్ లో మాత్రం కాదు.

ఎప్పటి నుంచి ఈ ఫీచర్ యూజర్లకు అందుబాటులోకి వస్తుంది అనేదానిపై క్లారిటీ లేదు. నైట్ మోడ్ ఫీచర్ ద్వారా.. వాట్సాప్ బ్యాక్ గ్రౌండ్ పూర్తిగా బ్లాక్ కనిపించదు. డార్క్ షేడ్ గ్రేతో ఉంటుంది. గతంలో వాట్సాప్ ఎన్నో అప్ డేట్ లను రిలీజ్ చేసింది. 155కు పైగా రీడిజైన్ ఎమోజీలను తీసుకొచ్చింది. వీటిని మరింత చిన్నగా కనిపించేలా వాట్సాప్ వర్క్ చేస్తోంది. కొన్ని ఎమోజీలు మాత్రం వాట్సాప్ పూర్తిగా రీడిజైన్ చేసింది. 

WhatsApp beta update
Night Mode
Whatsapp Users
Beta Version
Latest Updates

మరిన్ని వార్తలు