కన్హయ్యను విమర్శించే నైతిక హక్కు బీజేపీకి ఎక్కడిది?

Submitted on 16 January 2019
"What Moral Right Does BJP Have To Condemn Kanhaiya Kumar?": Shiv Sena

మాజీ జేఎన్ యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ ని విమర్శించే నైతిక హక్కు బీజేపీకి లేదని శివసేన తెలిపింది. పార్లమెంట్ పై దాడికి పాల్పడిన అప్జల్ గురుని ఫ్రీడమ్ ఫైటర్, అమరవీరుడంటూ మాట్లాడిన పీడీపీతో జమ్మూకాశ్మీర్ లో పొత్తు పెట్టుకొని బీజేపీ పాపానికి పాల్పడిందని, పాపానికి పాల్పడిన బీజేపీకి కన్హయ్యను విమర్శించే నైతిక హక్కు ఎక్కడదని శివసేన ప్రశ్నించింది. పొలిటికల్ మైలేజ్ కోసమే బీజేపీ కన్హయ్యపై విమర్శలు చేస్తోందని శివసేన తన అధికార పత్రిక సామ్నాలో ఓ ఆర్టికల్ ప్రచురించింది.

2008 ముంబై మారణహోమంలో నిందితుడు అజ్మల్ కసబ్ లాంటి ఉగ్రవాదికి తనను తాను ఢిఫెండ్ చేసుకొనేందుకు కోర్టు ఓ అవకాశమిచ్చిందని, కన్హయ్య కుమార్ కి కూడా తన కేసుని తాను వాదించుకొనేందుకు అవకాశం ఇవ్వాలని తెలిపింది. కన్హయ్యపై వస్తున్న ఆరోపణలు నిరాధారణమైనవి అయితే అవి కోర్టులో నిలబడవని శివసేన తెలిపింది. ఆరెస్సెస్ విద్యార్థి విభాగం ఏబీవీపీ జేఎన్ యూ ఎన్నికల్లో ఓడిపోయిందని, దీనికి ప్రధాన కారణం ఈవీఎమ్ మిషన్ల ద్వారా అక్కడ ఎన్నికలు జరుగకపోవడమేనని తెలిపింది.


ఢిల్లీ జేఎన్ యూ క్యాంపస్ లో 2016 ఫిబ్రవరిలో ఉగ్రవాది అఫ్జల్ గురుకి మద్దతుగా దేశవ్యతిరేక నినాదాలు చేశాడన్న ఆరోపణలతో కన్హయ్య కుమార్, మరికొందరిపై ఢిల్లీ పోలీసులు పటియాలా హౌస్ కోర్టులో సోమవారం చార్జి షీటు ఫైల్ చేసిన విషయం తెలిసిందే.

SIVASENA
Kanhaiya Kumar
BJP
moral right

మరిన్ని వార్తలు