నంబర్లలోనే కాంగ్రెస్ ఓడిపోయింది...ఐడియాలజీలో కాదు

Submitted on 25 May 2019
We've accepted our defeat but it was a defeat of numbers & not ideology...Azad

ప్రజాస్వామ్యంలో గెలుపు,ఓటమి రెండూ ఉంటాయని,అయితే నాయకత్వం అందించడం వేరే విషయమని సీనియర్ కాంగ్రెస్ నాయకులు గులాంనబీ ఆజాద్ అన్నారు.కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం అనంతరం ఆజాద్ మీడియాతో మాట్లాడుతూ...అందరికీ కనిపించే నాయకత్వాన్ని రాహుల్ అందించారు.టీవీలో అది తక్కువ కన్పించవచ్చు. కానీ ప్రజలకు చాలా సృష్టంగా కన్పించిందని ఆయన అన్నారు.

పార్టీ ఓటమిని తాము అంగీకరిస్తున్నామని అయితే ఇది నంబర్ల ఓటమి మాత్రమే ఐడియాలజీ ఓటమి కాదని ఆజాద్ తెలిపారు. సీడబ్యూసీ మీటింగ్ లో ప్రతి ఒక్కరూ...రాహుల్ పనితీరుని ప్రశంసించారని అన్నారు. రాహుల్ నాయకత్వంపై ఏ ఒక్కరికీ సందేహాలు లేవని,కానీ పరిస్థితులు అలా ఉన్నాయని ఆజాద్ అన్నారు.క్లిష్ట పరిస్థితుల్లో ఎవరైనా పార్టీని నడిపించగలరంటే అది రాహుల్ గాంధీ ఒక్కరేనన్నారు.ప్రతిపక్షాన్ని ఎవరైనా నడిపించగలరంటే అది రాహుల్ గాంధీ ఒక్కరేనని ఆజాద్ అన్నారు. సీడబ్యూసీలో రాహుల్...తను రాజీనామా చేస్తానని చెప్పారని,అయితే సీడబ్యూసీ సభ్యులు ఏకగ్రీవంగా రాహుల్ ప్రతిపాదనను తిరస్కరించారని కాంగ్రెస్ నాయకుడు రణదీప్ సుర్జేవాలా తెలిపారు.

gulamnabi azad
Congress
Randeep Surjewala
defeat
idealogy
Numbers
ACCEPT
cwc
RAHULGANDHI
leadership

మరిన్ని వార్తలు