అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం 
Earthquake Hits Andaman Nicobar Islands
murthy Fri, 04/19/2019 - 08:24

పోర్టుబ్లెయిర్: అండమాన్ నికోబార్ దీవుల్లో శుక్రవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 5.1 గా నమోదైందని భారత వాతావరణశాఖ అధికారులు చెప్పారు. శుక్రవారం తెల్లవారుజామున గం. 3.27 నిమిషాలకు పదికిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని అధికారులు చెప్పారు. ఈ భూకంపం ప్రభావం వల్ల ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవించలేదు. భూకంపం ప్రభావిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవుల్లో ఏప్రిల్ 1వతేదీనుంచి ఇప్పటివరకు భూమి 20 సార్లు కంపించిందని అధికారులు వివరించారు.

 

earthquake
Andaman Nicobar
5.1
India Met department

వాతావరణ వార్తలుమరిన్ని..