చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు : రెండ్రోజులు భారీ వర్షాలు
Heavy rain for two days In Telangana State
madhu Sat, 07/20/2019 - 07:53

తెలంగాణ రాష్ట్రంపై రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. కొన్ని రోజులుగా వర్షాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు కురుస్తున్న వర్షాలతో ఊరట చెందుతున్నారు. 2019, జులై 19వ తేదీ శుక్రవారం హైదరాబాద్‌లో వర్షం కురిసింది. రానున్న రెండు రోజులు ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు, పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 

పశ్చిమ రాజస్థాన్‌లోని మిగిలిన ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తున్నాయని, శుక్రవారం భారతదేశం మొత్తం విస్తరించాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఆంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. 

హైదరాబాద్ లో రాత్రి పలుచోట్ల భారీ వర్షం కురిసింది. పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కొండాపూర్, మియాపూర్, కూకట్ పల్లి, సికింద్రాబాద్, నాగోల్, రామంతపూర్‌తోపాటు పలు ప్రాంతాల్లో ఈదరుగాలులతో కూడిన వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల ట్రాఫిక్‌ జామ్ అయింది. 

heavy Rain
two days
Telangana state

వాతావరణ వార్తలుమరిన్ని..