ఫిబ్రవరి 22న ఓటర్ల తుది జాబితా - దాన కిషోర్

Submitted on 11 February 2019
we will release final voters list on 22th February says Dana Kishore

హైదరాబాద్ : ఓటర్ల తుది జాబితా సిద్ధమౌతోంది. 2019 జనవరి 1నాటికి 18 ఏళ్లు నిండిన వారు ప్రతొక్కరూ ఓటర్‌గా నమోదు చేసుకోవాలని...ఓటర్లలో తప్పులు ఉంటే సరిచేసుకోవాలని జీహెచ్ఎంసీ, ఎన్నికల అధికారులు కార్యక్రమాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనితో చాలా మంది తమను పేరును నమోదు చేసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 22వ తేదీన తుది జాబితా ప్రకటించడం జరుగుతుందని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి దాన కిషోర్ వెల్లడించారు. 


తమకు వచ్చిన దరఖాస్తులపై విచారణ పూర్తి చేస్తామన్నారు. ఇప్పటి వరకు 1.47 వేల కొత్త ఓటర్లు చేరారని, మొత్తం మీద 28 వేల 500 ఓట్లను తొలగించినట్లు చెప్పారు. ఫిబ్రవరి 11వ తేదీ నుండి ఈవీఎంలకు ఫస్ట్ లెవల్ చెకింగ్ ఉంటుందని..ఇందుకు ముగ్గురు నోడల్ అధికారులుగా నియమించినట్లు వెల్లడించారు. ఫిబ్రవరి 4వ తేదీ నాటికి 1,74,966 ఫామ్ - 6 దరఖాస్తులు, ఫామ్ 6 ఏ దరఖాస్తులు 487, ఫామ్ 7 దరఖాస్తులు 42, 479, ఫామ్ - 8 దరఖాస్తులు 35, 982, ఫామ్ 8 ఏ దరఖాస్తులు 59, 132 వచ్చాయన్నారు. సమగ్రంగా ఓటర్ల జాబితాను తయారు చేస్తామని దాన కిషోర్ తెలిపారు. 

final
Voters List
February
Dana Kishore
Ghmc Commisionr
Hyderabad Dist
Telangana Election Commision

మరిన్ని వార్తలు