రామమందిర నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం:అమిత్ షా

Submitted on 11 January 2019
amith shah

ఢిల్లీ: అయోధ్యలోని రామజన్మభూమిలోనే రామమందిర నిర్మాణం చేపడతామని బీజేపీ జాతీయఅధ్యక్షుడు అమిత్ షా స్పృష్టం చేశారు.రామ్ లీలా మైదానంలో జరుగుతున్న బీజేపీ  జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన ఈకీలక వ్యాఖ్యలు చేశారు. రామజన్మభూమి కేసు విచారణ వేగవంతం చేసేందకు తాముప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు. రామాలయనిర్మాణానికి బీజేపీ కట్టుబడి ఉందని, కాంగ్రెస్ పార్టీ అడ్డంకులు సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు. రామాలయం పై అమిత్ షా మాట్లాడేటప్పుడు సభలో పాల్గోన్నవారు ఆనందంతో చప్పట్లుకొట్టారు.
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో బీజేపీ 74  పార్లమెంట్ స్ధానాలు గెలుచుకుంటుందని కాంగ్రెస్  పార్టీ, రాహుల్ గాంధీ దేశభద్రత గురించి పట్టించుకోరని ఆయన అన్నారు.

Amit Shah
BJP National Executive Meet
Ram Mandir
Ayodhya

మరిన్ని వార్తలు