చెన్నైలో కోటా పెట్టారు : మంచినీళ్లు కావాలంటే టోకెన్లు తీసుకెళ్లాలి

Submitted on 19 June 2019
water crisis in Tamil Nadu: token system started to supply water

గుక్కెడు నీటి కోసం అల్లాడుతోంది చెన్నై మహానగరం. కళ్లెదుట మహా సముద్రం కనిపిస్తున్నా.. గ్లాసుడు మంచి నీళ్లు లేక విలవిలలాడుతోంది. స్నానాలు చేసి రెండు, మూడులు రోజులు అవుతున్నా భరిస్తున్న చెన్నై వాసులు.. మంచినీటి కోసం మాత్రం దాహం.. దాహం అంటున్నారు. తాగటానికి నీళ్లు ఇస్తే చాలు స్వామీ అని వీధుల్లోని ట్యాంకర్ల దగ్గర యుద్ధాలు చేస్తున్నారు. పరిస్థితి అదుపుతప్పటంతో.. ట్యాంకర్ల దగ్గర మంచినీటికి టోకెన్ల సిస్టమ్ తీసుకొచ్చారు. ప్రతి ఇంటికి రెండు టోకెన్ల చొప్పున ఇస్తున్నారు. వీధిలోకి ట్యాంకర్ వచ్చినప్పుడు.. ఈ టోకెన్లు చూపిస్తే నాలుగు అంటే నాలుగు బిందెలు మాత్రమే ఇస్తున్నారు. మంచినీటికి కోటా పెట్టి.. కడుపు మంట రేపుతున్నారు.

ఓ వైపు కరూర్ జిల్లాలోని కులితలై దగ్గరి ప్రాంతంలో కావేరీ నది నుంచి వచ్చే పైపు లైన్ లీక్ అవడంతో వేల లీటర్ల నీరు వృథాగా పోతుంది. అరగంటలో త్రిచి జిల్లాకు రావాల్సిన నీళ్లన్నీ లీకైపోయాయి. స్థానికులు నీళ్లు పోతున్నాయని ఫిర్యాదు చేసేంత వరకూ అధికారులకు సమస్య అర్థం కాలేదు. నీటి కొరత తీర్చేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో జనావాసమంతా నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 

నీళ్లు లేక  చెన్నై వాసులు అధిక ధర చెల్లించి నీటిని కొనుగోలు చేస్తున్నారు. అయినప్పటికీ నీళ్లు వారికి దొరక్కపోవడంతో రీసెంట్‌గా టోకెన్ల సిస్టమ్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మధ్యన నీళ్ల కోసం జరిగిన గొడవలో తమిళనాడు స్పీకర్ ధనపాల్ డ్రైవర్ రామకృష్ణన్ నీళ్ల కోసం గొడవపడుతూ తన పొరుగింట్లో నివసించే ఓ మహిళపై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. దీంతో ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆ మహిళ ఆరోగ్యం కుదుటపడుతోంది. హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది.

వీటన్నిటిని అదుపులోకి తెచ్చేందుకు టోకెన్ల పద్ధతిని మొదలుపెట్టడంతో రోయపెట్ట ప్రాంతంలో నీటి సరఫరా సజావుగా సాగుతుంది.

Water Crisis
Tamil Nadu
token system
Water Supply

మరిన్ని వార్తలు