72 ఏళ్ల బామ్మ : జిమ్ విన్యాసాలు 

Submitted on 5 February 2019
72-Year-Old Woman Doing GYM

వాషింగ్టన్: బాడీ ఫిట్ గా ఉంచుకోవాలనే కోరికతో జిమ్ కెళ్లిపోయి కసరత్తులు చేసేస్తుంటారు. కొత్తలో మాంచి ఉత్సాహంగానే వెళతారు..రోజులు గడిచే కొద్దీ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. దాంతో డమ్మాలు కొట్టేస్తారు..తరువాత రాను రాను మొత్తానికే మానేస్తారు. ముపై ఏళ్ల రాగానే మెకాళ్ల నొప్పులు..నలభై ఏళ్లు రాగానే నడుం నొప్పులు ఇలా చిన్న వయస్సులోనే రకరకాల ఆరోగ్యం సమస్యలు. ఇటువంటివారికి ఈ అమెరికా బామ్మగారి ఎక్సర్ సైజుల్ని చూపించి తీరాల్సిందే. ఈ బామ్మగారి జిమ్ విన్యాసాల వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. 

అమెరికాలోని వాషింగ్టన్‌కు చెందిన లారిన్ బ్రూజోన్ అనే మహిళ 72 ఏళ్ళ వయసులోనూ జిమ్‌లో కసరత్తులు ‌చేసేస్తూ..పెద్ద పెద్ద  బరువులు ఎత్తేస్తు..నేటి యువతరానికి సవాల్ విసురుతున్నారు.జిమ్‌లో ఆమె చేస్తున్న వ్యాయామాలకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కనెక్టిక్ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు లారిన్. ‘మండే మోటివేషన్’ అనే ట్యాగ్ తో కూడిన ఈ వీడియోపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇన్‌స్టాగ్రామ్‌లోని ఈ వీడియోకు ఇప్పటివరకూ 17 వేలకు మించిన లైక్‌లు వచ్చాయి. అన్ని విషయాలలోను ఎంతో ఉత్సాహంగా ఉండే లారిన్  ఫిట్‌నెస్ క్లాసులు కూడా చెబుతుంటారట.

 

america
Washington
Lauren Bruzon
Jim
Video
Wydia
viral


మరిన్ని వార్తలు