ఆఫీస్ కి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది.. జెట్ సూట్ వచ్చేస్తోంది

Submitted on 13 February 2020
Want to fly to work? This Marvel Man is working on it

ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, పార్కింగ్, కాలుష్యం బాధలు లేకుండా.. ఎంచక్కా గాల్లో ఆఫీస్ కు ఎగురుకుంటూ వెళ్తే ఎలా ఉంటుంది? అది కూడా గంటకు 50 కిలోమీటర్ల వేగంతో.. వినడానికే చాలా హాయిగా అనిపిస్తోంది కదూ. అది నిజమైతే.. మాటల్లో వర్ణించలేని ఆనందం కలుగడం ఖాయం. గాల్లో ఎగురుకుంటూ ఆఫీస్ కి వెళ్లే రోజు త్వరలోనే రానుంది. ఇందుకోసం ప్రయోగం జరుగుతోంది.

గాల్లో ఎగురుకుంటూ ఆఫీస్ కి వెళ్లేందుకు ఓ మిషన్ తయారవుతోంది. ఫ్యూచర్ ట్రాన్స్ పోర్టేషన్ ఐడియాల్లో ఇదొకటి. ఇందులో భాగంగా జెట్ సూట్ ని తయారు చేస్తున్నారు. ఈ జెట్ సూట్ వేసుకుంటే.. ఎంచక్కా ఆకాశంలో గాల్లో పక్షిలా ఎగురుతూ ప్రయాణం చేయొచ్చు. ఈ జెట్ సూట్.. గ్యాస్ టర్బైన్ తో పని చేస్తుంది. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉంది. సామ్ రోజర్స్ అనే వ్యక్తి.. జెట్ సూట్ ఎలా పని చేస్తుంది అనేది వివరించాడు. అతడు జెట్ సూట్ ధరించి అమాంతం గాల్లోకి ఎగిరాడు. ఇది చూసిన వాళ్లు.. వావ్ అంటూ ఆశ్చర్యపోయారు. నిజంగా అద్భుతంగా ఉందన్నారు.

fly

సామ్ రోజర్స్.. జెట్ సూట్ ధరించి.. నదిపై ప్రయాణించాడు. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లాడు. భవిష్యత్తులో మనుషులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఇలా గాల్లో ఎగురుకుంటూ వెళ్లే రోజు తీసుకురావాలనేది తన లక్ష్యంగా చెప్పాడు.

''ఇలా గాల్లో ఎగరడం గొప్ప అనుభూతి కలిగించింది. మార్వెల్ సూపర్ హీరోస్ తరహాలో గాల్లో ఎగరడం ఆనందాన్ని ఇచ్చింది. గత 18 నెలల కాలంలో 20 దేశాల్లో 60 ఈవెంట్స్ లో ఈ జెట్ సూట్ ని ప్రదర్శించా. ఫైవ్ టర్బో జెట్ ఇంజిన్ జెట్ సూట్.. పూర్తిగా త్రీడీ ఫ్రింటెడ్..అల్యుమీనియం, స్టీల్, నైలాన్ తో తయారు చేశారు'' అని రోజర్స్ తెలిపారు. ఈ జెట్ సూట్ లో కిరోసిన్ ఫ్యూయల్డ్ టర్బైన్స్ ఉన్నాయి. ఒక్కో గొట్టం 22 కిలోల బరువు ఉంటుంది. జెట్ సూట్ ఖరీదు 3 కోట్ల 13లక్షలు. ఇప్పటివరకు కంపెనీ వాళ్లు 10 సూట్లు అమ్మారు.

want to fly
WORK
marvel man
jet suit
future transportation
sam rogers
gas turbine powered jet suit

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు