రైతు క్యారెక్టర్‌‌లో వినాయక్

Submitted on 19 September 2019
V.V.Vinayak plays former role in his debut film

మాస్ అండ్ హై ఓల్టేజ్ యాక్షన్ సినిమాలను తెరకెక్కించడంలో వి.వి.వినాయక్ స్టైలే వేరు. ఇప్పటి వరకు దర్శకుడిగా తెర వెనక యాక్షన్ చెప్పిన ఆయన త్వరలో మరొక డైరెక్టర్ యాక్షన్ చెప్తే, యాక్ట్ చెయ్యనున్నాడు. సాధారణంగా సీన్ షూట్ చేసే ముందు హీరోలకు తను నటించి చూపిస్తుంటాడు వినాయక్.. చిరంజీవి 'ఠాగూర్', 'ఖైదీ నెం:150' సినిమాల్లో కాసేపు తెరపై తళుక్కుమన్నాడు కూడా.

ఇప్పుడు పూర్తిస్థాయి హీరోగా అరంగేట్రం చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ ద్వారా నిర్మాత దిల్ రాజు, వినయ్‌ని హీరోగా లాంచ్ చేస్తున్నాడు. 'శరభ' ఫేమ్ ఎన్. నరసింహరావు ఈ సినిమాని డైరెక్ట్ చెయ్యనున్నాడు. లేటేస్ట్ అప్‌డేట్ ఏంటంటే, వినాయక్ ఈ సినిమాలో రైతుగా కనిపించనున్నాడట. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో 1940ల నాటి కాలంలో జరిగే కథ అని తెలుస్తుంది.

ఈ సినిమా షూటింగ్‌ను వినయ్ బర్త్‌డే సందర్భంగా అక్టోబర్ 9న ప్రారంభించనున్నారట. వినాయక్ కొద్ది కాలంగా వర్కౌట్స్ చేసి స్లిమ్ అయ్యాడు. ప్రస్తుతం నటీనటుల, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతుంది.
 

V.V.Vinayak
Dil Raju
N.Narasimha Rao

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు