చెత్తకుప్పలో వీవీప్యాట్ స్పిప్పులు : అరెస్ట్ చేయాలని CEO ఆదేశం

Submitted on 15 April 2019
vvpat slips issue, ceo orders for arrest

అమరావతి : నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ పాఠశాల ఆవరణలోని చెత్తకుప్పలో వీవీ ప్యాట్ స్లిప్పులు ఉండటంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది సీరియస్ అయ్యారు. వీవీ ప్యాట్ స్లిప్పులు ఇలా బయటకు రావడాన్ని ద్వివేది తప్పుపట్టారు. ఈ విషయంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులను గుర్తించి వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని, తక్షణమే అరెస్ట్ చేయాలని కలెక్టర్ కు ద్వివేది ఆదేశించారు. ప్రతి నియోజకవర్గ పరిధిలో జరిగే తప్పులకు రిట్నరింగ్ అధికారులదే బాధ్యత అన్నారు. అవి డమ్మీ స్లిప్పులు అని, పోలింగ్‌ రోజువి కాదని స్పష్టం చేశారు. ఆత్మకూరు ప్రభుత్వ పాఠశాలలో ఈవీఎం కమిషనింగ్ సెంటర్ మాత్రమే ఉందన్నారు. ఎవరో ఉద్యోగి కావాలనే ఆ స్లిప్పులను ఆరు బయట పడేసినట్లున్నారని ద్వివేది అనుమానం వ్యక్తం చేశారు.

సోమవారం (ఏప్రిల్ 15, 2019) ఆత్మకూరులోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో వందల సంఖ్యలో వీవీ ప్యాట్ స్లిప్స్ కనిపించడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. స్కూల్ పక్కనే ఉన్న చెత్త కుప్పలో కూడా స్లిప్స్ దర్శనం ఇచ్చాయి. స్లిప్పులను చూసిన విద్యార్థులు టీచర్లకు సమాచారం ఇవ్వడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న ఆర్డీవో తనిఖీ చేశారు. వెంటనే వాటిని సేకరించడం మొదలు పెట్టారు. వాటన్నింటిని కాల్చే ప్రయత్నం చేశారు. మీడియాలో ప్రసారం చేయొద్దని సిబ్బంది వేడుకున్నారు. నిబంధనల ప్రకారం స్లిప్పులను భద్రపరచాలి. సిబ్బంది మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సిబ్బంది తీరుపై విమర్శలు వస్తున్నాయి. రాజకీయ పార్టీలు, స్థానికులు, ఉన్నతాధికారులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వివరణ అడిగారు

vvpat slips
Nellore
Atmakur
ceo gk dwivedi
Arrest
Government School

మరిన్ని వార్తలు