ఎమ్మార్వో ఎదుటే డబ్బు కోసం కొట్టుకున్న వీఆర్వోలు

Submitted on 17 November 2019
VRO's that have been beaten for money in presence of MRO

ఓ వైపు ఎమ్మార్వోల అక్రమ వసూళ్లు, అవినీతిపై తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో వచ్చిన సమయంలోనే మరోవైపు ప్రభుత్వ అధికారులు చేసే పనులు కూడా ప్రజలకు వాళ్లపై ఉండే నమ్మాకాన్ని సన్నగిల్లేలా చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు. దేశవ్యాప్తంగా రెవెన్యూ అధికారులూపై నిఘా పెరిపోయింది. ఇదిలా ఉంటే లేటెస్ట్‌గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఇద్దరు వీఆర్వోలు బహిరంగంగా ఎమ్మార్వో ఎదుటే బాహాబాహీకి దిగడం చర్చనీయాంశం అయ్యింది.

వివరాల్లోకి వెళ్తే.. సుంకేసుల వీఆర్వో వేణుగోపాల్‌రెడ్డి, జోహారాపురం వీఆర్వో కృష్ణదేవరాయ మధ్య డబ్బుల విషయంలో గొడవ తలెత్తగా.. కర్నూలు నగరంలోని ఎమ్మార్వో కార్యాలయంలో ఇద్దరు వీఆర్వోలు కొట్టుకున్నారు. ఒకరినొకరు కొట్టుకోవడంతో ఇద్దరికీ తీవ్రంగా గాయాలయ్యాయి. డబ్బుల పంపకాల్లో ఏర్పడ్డ గొడవలో ఇద్దరు వీఆర్వోలు కొట్టుకున్నారు.

డబ్బు కోసం వేధిస్తున్నాడంటూ గొడవకు దిగిన వీఆర్వో కృష్ణదేవరాయ, వీఆర్వో వేణుగోపాల్‌రెడ్డి చెవి కొరికారు. అక్కడే ఉన్న ఎమ్మార్వో ఇద్దరి మధ్య రాజీకి ప్రయత్నించారు. కానీ వాళ్లు వినలేదు. కొంత సమయం తర్వాత ఇద్దరూ శాంతించడంతో ఎమ్మార్వో సహా అక్కడ ఉన్నవారు ఊపిరి పీల్చుకున్నారు.

VRO's
Money
MRO
Kurnool

మరిన్ని వార్తలు