స్పెషల్ ఆఫర్ : వోడాఫోన్ కొత్త రీఛార్జ్ ప్లాన్

Submitted on 12 February 2019
Vodafone Rs 351 prepaid recharge offers unlimited calling to new customers

రోజులు మారుతున్నాయి. కస్టమర్లు మరో నెట్ వర్క్ కు మారిపోతున్నారు. దీంతో టెలికం కంపెనీలు కూడా తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఎడాపెడా ఆఫర్లు, రీఛార్జ్ ప్లాన్ లు గుప్పిస్తున్నాయి. రిలయన్స్ జియో రాకతో టెలికం కంపెనీల్లో మరింత పోటీవాతావరణం నెలకొంది. పోటాపోటీగా కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త కొత్త ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. ప్రముఖ మొబైల్ నెట్ వర్క్ దిగ్గజం వోడాఫోన్ తమ ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం స్సెషల్ రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. రూ.351 తో రీఛార్జ్ చేసుకుంటే చాలు.. FUP లేకుండా 56 రోజుల కాల పరిమితిపై అన్ లిమిటెడ్ కాలింగ్ పొందొచ్చు.


అంతేకాదు.. ఎస్ఎంఎస్ బెనిఫెట్స్ కూడా ఉన్నాయి. ఈ రీఛార్జ్ ప్లాన్ కొత్త కస్టమర్లకేనట. ఫస్ట్ టైం రీఛార్జ్ (FRC) కింద వోడాఫోన్ కొత్త ప్రీపెయిడ్ కస్టమర్లకే వర్తిస్తుందని ఒక ప్రకటనలో తెలిపింది. వోడాఫోన్ కస్టమర్ ఎవరైతే కొత్త SIM కనెక్షన్ తీసుకుంటారో వారు ఫస్ట్ రీఛార్జ్ రూ.351తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. న్యూ ఎఫ్ఆర్ సీ ఆఫర్ల కింద సదరు కస్టమర్ కు ఆన్ లిమిటెడ్ కాలింగ్ తో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్ లు పొందొచ్చు.


ఈ ఆఫర్ లో డేటా బెనిఫెట్ లేకపోవడం వోడాఫోన్ కొత్త కస్టమర్లకు అసంతృప్తిగా అనిపించే విషయమే. అయినప్పటికీ కాలింగ్ బెనిఫెట్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఎందుకంటే.. దీనికి డెయిలీ, వీక్లీ అంటూ ఎలాంటి FUP పరిమితి లేదు. అంటే.. 56 రోజుల పాటు ఎంతసేపు అంటే అంతసేపు అన్ లిమిటెడ్ కాల్స్ ను ఎంజాయ్ చేయొచ్చు. వోడాఫోన్ కొత్త రూ.351 రీఛార్జ్ ప్లాన్ తో పాటు వోడాఫోన్ FRC కింద ఫస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ రూ.176, రూ.229, రూ.496, రూ.555 కూడా అందుబాటులో ఉన్నాయి. 
 

1. వోడాఫోన్ (FRC)రూ.176 ఆఫర్: 
వోడాఫోన్ అందిస్తోన్న రూ.176 (ఎఫ్ఆర్ సీ) ఆఫర్ తో కస్టమర్లకు ఉచితంగా అన్ లిమిటెడ్ కాల్స్ పొందొచ్చు. ఏ నెట్ వర్క్ మొబైల్, ల్యాండ్ లైన్ కు 28 రోజుల పాటు ఫ్రీ కాల్స్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ లో 1జీబీ (2జీ/3జీ/4జీ) 28 రోజుల కాలపరిమితిపై పొందొచ్చు. 
 

2. వోడాఫోన్ (FRC)రూ.229 ఆఫర్: 
వోడాఫోన్ అందిస్తోన్న రూ.229(ఎఫ్ఆర్ సీ) ఆఫర్ తో ఫస్ట్ టైం రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లకు ఉచితంగా అన్ లిమిటెడ్ కాల్స్ పొందొచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్, 1జీబీ డేటా 28 రోజుల కాలపరిమితిపై పొందొచ్చు. 
 

3. వోడాఫోన్ (FRC)రూ.496 ఆఫర్: 
వోడాఫోన్ అందిస్తోన్న రూ.496(ఎఫ్ఆర్ సీ) ఆఫర్ తో ఫస్ట్ టైం రీఛార్జ్ చేసుకున్న ప్రీఫెయిడ్ కస్టమర్లకు ఉచితంగా అన్ లిమిటెడ్ లోకల్, STD,రోమింగ్ కాల్స్ పొందొచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్, 1.4జీబీ డేటా 70 రోజుల కాలపరిమితిపై పొందొచ్చు. ఈ ప్లాన్ లో ఫ్రీ రోమింగ్ బెనిఫెట్స్ కూడా యూజర్లు 84 రోజుల కాలపరిమితిపై పొందొచ్చు. 
 

4. వోడాఫోన్ (FRC)రూ.555 ఆఫర్: 
వోడాఫోన్ అందిస్తోన్న రూ.555(ఎఫ్ఆర్ సీ) ఆఫర్ తో ఫస్ట్ టైం రీఛార్జ్ చేసుకున్న ప్రీఫెయిడ్ కస్టమర్లకు ఉచితంగా లోకల్, STD,రోమింగ్ కాల్స్ పొందొచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్, 1.4జీబీ డేటా 90 రోజుల కాలపరిమితిపై పొందొచ్చు. 

Vodafone
Prepaid Recharge
new customers
Unlimited calls

మరిన్ని వార్తలు