ఫీచర్లు ఇవే : Quad కెమెరాలతో Vivo S5 ఫోన్ వచ్చేసింది

Submitted on 17 November 2019
Vivo S5 launched: Key specs, price, India launch details and everything else

చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ వివో కంపెనీ S సిరీస్ నుంచి కొత్త మోడల్ వచ్చింది. అదే.. Vivo S5 స్మార్ట్ ఫోన్. బీజింగ్‌లో లాంచ్ అయిన ఈ కొత్త ఫోన్ వెనుక క్వాడ్ కెమెరా సెటప్‌తో రెండు స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. రెండు ఫోన్ల మధ్య ధర 300 యాన్స్ వ్యత్యాసం ఉంది. బేస్ వేరియంట్ ఫోన్ ధర 2698 యాన్ (రూ.27వేల 650), టాప్
ఎండ్ మోడల్ ఫోన్ ధర 2998 యాన్స్ (రూ.30వేల 720)గా కంపెనీ నిర్ణయించింది. 

గతంలో వివో కంపెనీ ఇదే సిరీస్ ఫోన్లను ఎన్నో రిలీజ్ చేసింది. కొత్త Vivo S5 మోడల్ ఫోన్ కూడా ఆకర్షణీయమైన డిజైన్‌తో వచ్చింది. 2019 ఏడాది ఆగస్టులో రిలీజ్ అయిన Vivo S1 మోడల్ తో సక్సెస్ సాధించింది. వివో S5 మోడల్ ఫీచర్ల విషయానికి వస్తే.. 6.44 అంగుళాల OLED డిస్ ప్లే, ఫుల్ HD+ రెజుల్యూషన్ (1080 ఫిక్సల్స్)తో వచ్చింది.  స్ర్కీన్ టూ బాడీ రేషియో 91.38 శాతంగా ఉంది. శాంసంగ్ గెలాక్సీ S10 ఫోన్ల మాదిరిగానే అదే లుక్ కనిపిస్తోంది. 

టాప్ రైట్ కార్నర్ డిసిప్లేపై పంచ్ హోల్ అలానే ఉంది. వివో S5లో 8GB ర్యామ్ తో పాటు 2.3GHz స్నాప్ డ్రాగన్ 712 ఆక్టా కోర్ ప్రాసెసర్ సామర్థ్యం ఉంది. 256GB వరకు ఆన్ బోర్డు స్టోరేజీ ఉండగా మైక్రో SD కార్డు ద్వారా మరింత విస్తరించుకోవచ్చు. బ్యాటరీ 4,010mAh బ్యాటరీ సామర్థ్యంతో ఒకసారి ఛార్జ్ చేస్తే రోజుంతా వాడుకోవచ్చు. ఈ ఫోన్ ఐస్లాండిక్ బ్లూ, ఫాంటాన్ బ్లూ, స్టార్ బ్లాక్ మొత్తం మూడు రంగుల్లో లభ్యమవుతోంది. 

ఫీచర్లు - స్పెషిఫికేషన్లు :
* 6.44-అంగుళాల OLED డిస్‌ప్లే 
* FullHD+ రెజుల్యుషన్ (1080 ఫిక్సల్స్)
* స్ర్కీన్ టూ బాడీ రేషియో 91.38 శాతం
* ప్రాసెసర్ : 2.3GHz స్నాప్ డ్రాగన్ 712 అక్టా కోర్ 
* 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ + 256GB స్టోరేజీ
* క్వాడ్ కెమెరా సెటప్, LED ఫ్లాష్ (బ్యాక్)
* మూడు కెమెరా సెన్సార్లు (LED ఫ్లాష్)
* డైమండ్ ఆకృతిలో కెమెరా మాడ్యూల్
* ఫోర్త్ కెమెరా సెన్సార్ (మాడ్యూల్ కింద)
* 48MP ప్రైమరీ కెమెరా సెన్సార్
* 8MP అల్ట్రా వైడ్ లెన్స్
* 5MP డెప్త్ సెన్సార్
* 2MP మ్యాక్రో లెన్స్ కెమెరా
* ఫ్రంట్ కెమెరా : 32MP సెల్ఫీ షూటర్
* 4,010mAh బ్యాటరీతో 22.5W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
* Funtouch OS 9.2 (ఆండ్రాయిడ్ 9పై)
* ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ఫ్రింట్ సెన్సార్

Vivo S5
india
new Vivo S5
quad-camera set-up
TUV Rhineland certified
Samsung Galaxy S10

మరిన్ని వార్తలు