మార్చి 21 న విశ్వామిత్ర

Submitted on 16 February 2019
Vishwamitra Releasing on 21st March-10TV

గీతాంజలి, త్రిపుర వంటి థ్రిల్లర్ సినిమాలతో ఆడియన్స్‌ని ఆకట్టుకున్న రాజకిరణ్ డైరెక్షన్‌లో రూపొందుతున్న లేటెస్ట్ ఫిలిం.. విశ్వామిత్ర.. ఫణి తిరుమలశెట్టి సమర్పణలో, రాజకిరణ్ సినిమా, మధురం మూవీ క్రియేషన్స్‌పై, మాధవీ అద్దంకి, రజినీకాంత్ ఎస్, రాజకిరణ్ నిర్మిస్తున్నారు. నందితా రాజ్, సత్యం రాజేష్, అశుతోష్ రాణా, ప్రసన్న కుమార్ కీ రోల్స్ చేస్తున్నారు.

వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న థ్రిల్లర్ మూవీ ఇది.. అమెరికా, న్యూజిలాండ్‌లో నిజంగా జరిగిన కొన్ని కథలపై రీసెర్చ్ చేసి, ఈ కథ రాసుకున్నా, నందితా మిడిల్ క్లాస్ అమ్మాయిగా కనిపిస్తుంది.. సృష్టి మాత్రమే శాశ్వతం, మనుషులు ఈ సృష్టికి అతిథులు మాత్రమే.. సృష్టికీ, మానవ మేథస్సుకూ ముడిపెడుతూ తెరకెక్కించాం.. అని డైరెక్టర్ చెప్పాడు.. ఫిబ్రవరి 21 న విశ్వామిత్ర ట్రైలర్ రిలీజ్ కానుంది. మార్చి 21 న సినిమా విడుదలవుతుంది. ఈ సినిమాకి కెమెరా : అనిల్ బండారి, సంగీతం : అనూప్ రూబెన్స్.

Vishwamitra
Nanditha Raj
Anup Rubens
RaajaKiran

మరిన్ని వార్తలు