విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం

Submitted on 18 January 2019
Visakhapatnam Steel Plant Fire Accident

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఫ్యాక్టరీలోని బ్లాస్ట్ ఫర్నేస్-3లో బ్లో పైప్ పేలింది. దీంతో ఒక్కసారిగా ఫర్నేస్ నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. వ్యాపించిన మంటలు.. ముడిసరుకు వరకు వ్యాపించాయి. మంటల ధాటికి సమీపంలోని కార్మికుల ఏడు బైకులు, ఇతర మిషన్ సామాగ్రి కూడా కాలిపోయింది. అప్రమత్తమైన సీఐఎస్‌ఎఫ్‌ ఫైర్‌ విభాగం వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తేవడంతో భారీ ప్రమాదం తప్పింది. 

ప్రమాదం జరిగిన సమయంలో ఉద్యోగులు టిఫిన్ చేసేందుకు వెళ్లడంతో ప్రమాదం తప్పినట్లు కంపెనీ యాజమాన్యం తెలిపింది. అధికారులు, ఉద్యోగుల మధ్య సమన్వయం లేక సరైన నిర్వహణ లేకపోవడం వల్లే ఈ ప్రమాదానికి కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాంకేతిక కారణాలతో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టు అనుమానిస్తున్నారు. 24 గంటల్లో మళ్లీ  ఫ్యాక్టరీలో వర్క్ స్టార్ట్ అవుతుందని అధికారులు తెలిపారు. 

Visakhapatnam Steel Plant
Fire Accident

మరిన్ని వార్తలు