విశాఖ నార్త్ ఫలితంపై ఉత్కంఠ : రీపోలింగ్ నిర్వహించాలని వైసీపీ డిమాండ్

Submitted on 24 May 2019
visakha north assembly result, ysrcp demand for repolling

విశాఖ నార్త్ అసెంబ్లీ ఫలితం ఉత్కంఠగా మారింది. ఫలితాన్ని తాత్కాలికంగా పెండింగ్‌లో ఉంచారు. ఈ నియోజకవర్గం నుంచి పోటీ పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు 2వేల 439 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థిగా కేకే రాజు బరిలో ఉన్నారు. ఐదు పోలింగ్ బూత్ లలో ఈవీఎంలు తెరుచుకోకపోవడంతో వాటి వీవీ ప్యాట్‌లను లెక్కించాలని అధికారులు నిర్ణయిచారు. వీటిలో ఒక ఈవీఎంకు సంబంధించి 307 వీవీ ప్యాట్‌ల స్లిప్పులకుగాను 106 మాత్రమే ఉన్నాయి. దీంతో వైసీపీ అభ్యర్థి కేకే రాజు ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారులు ఎన్నికల కమిషన్‌కు నివేదిక అందించారు. దీంతో ఈసీ ఫలితాన్ని పెండింగ్‌లో పెట్టింది. వైసీపీ అభ్యర్థి కేకే రాజు రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. 42వ పోలింగ్ బూత్ సహా అనుమానం ఉన్న మరో నాలుగు పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ జరపాలని అంటున్నారు.

కౌంటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి విశాఖ నార్త్ ఫలితం ఉత్కంఠగా మారింది. అర్థరాత్రి వరకు కౌంటింగ్ నడిచింది. గెలుపు ఎవరిది అని టీడీపీ, వైసీపీ అభ్యర్థులు ఆత్రుతగా ఎదురుచూశారు. అర్థరాత్రి తర్వాత కూడా కౌంటింగ్ వ్యవహాం కొలిక్కి రాలేదు. వీవీప్యాట్ స్లిప్పుల్లో తేడాలో వచ్చాయి. దీంతో ఫలితాన్ని పెండింగ్ లో ఉంచారు. ప్రస్తుతం గంటా శ్రీనివాస్ 2వేల ఓట్లతో లీడ్ లో ఉన్నారు.

ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో తిరుగులేని గెలుపు నమోదు చేసింది. 175 అసెంబ్లీ స్థానాలకు 151 స్థానాలు కైవసం చేసుకుంది. టీడీపీ మాత్రం 23 స్థానాలతో  సరిపెట్టుకుంది. జనసేన ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ(గాజువాక, భీమవరం) పవన్ ఓడిపోయారు. లోక్ సభ ఎన్నికల్లోనూ వైసీపీ ప్రభంజనం సృష్టించింది. 25ఎంపీ స్థానాలకు 22చోట్ల  విజయం సాధించింది. టీడీపీ మూడు ఎంపీ స్థానాల్లో గెలుపొందింది.

visakha north assembly
Result
PENDING
Re polling
ysrcp demand
ganta srinivas rao
kk raju
vvpat
evms

మరిన్ని వార్తలు