మిస్టరీ ఏంటీ : లెక్చరర్ గదిలో స్టూడెంట్ ఆత్మహత్య

Submitted on 16 April 2019
Visakha Girl Jyotsna Death Mystery: Suicide or Murder ?

విశాఖపట్నంలో బీటెక్ విద్యార్ధిని ఆత్మహత్య కేసు అనుమానాస్పదంగా మారింది. ఇంటి నుంచి కాలేజీకి అని వెళ్లిన జోత్స్న అనే విద్యార్ధిని మల్కాపురంలోని లెక్చరర్ అంకుర్ ఇంట్లో ఉరేసుకుని చనిపోవడం కలకలం రేపుతుంది. ఇది ముమ్మాటికీ హత్యేనని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తుంటే.. తనకు ఎలాంటి సంబంధం లేదని లెక్చరర్ అంకుర్ చెప్తున్నారు.
Read Also : హైదరాబాద్‌లో లోన్ మోసం: నమ్మారో బ్యాంకులో మొత్తం నొక్కేస్తారు

జ్యోత్స్నకు గతంలో ఐఐటీలో కోచింగ్ ఇచ్చారు అంకుర్. అప్పటి నుంచి వీరి ఇద్దరి మధ్య పరిచయం ఉండగా.. జోత్స్న ఇప్పుడు బుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజీలో మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతుంది. అయితే బీటెక్‌లో చేరిన తరువాత కూడా జ్యోత్స్న తరచూ అంకుర్ గదికి వెళ్తుండేది. అయితే సబ్జెక్ట్‌లో డౌట్‌లు తీర్చుకునేందుకు జ్యోత్స్న అంకుర్ ఇంటికి వెళ్లేదా? లేక వారి మధ్య ఇంకేమైనా స్నేహం ఉందా? అనే అనుమానం పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.

తాను తన స్నేహితుడితో కలిసి రూమ్ తీసుకుని ఉంటున్నానని, ఉదయం తాము కాలేజ్‌కి వెళ్లాక జోత్స్న ఎందుకు రూమ్‌కి వచ్చిందో తెలియదని అంకుర్ అంటున్నారు. ఈ సూసైడ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని, జోత్స్న తనను ప్రేమిస్తున్నానంటూ గతంలో పలుమార్లు చెప్పిందని, కానీ ఒప్పుకోలేదని లెక్చరర్ చెబుతున్నారు. ఈ ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ధర్యాప్తు చేపట్టారు.

అంకుర్‌ను అతని స్నేహితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మరోవైపు తన కుమార్తెది ఆత్మహత్య కాదని, ముమ్మాటికీ హత్యేనని జ్యోత్స్న తండ్రి దేవానంద్ ఆరోపిస్తున్నారు.
Read Also : తమిళనాడు మాజీ ఎంపీ భార్య హత్య, కొడుకు మాయం

Visakha Girl
Jyotsna
Death Mystery
Suicide
murder


మరిన్ని వార్తలు