పుల్వామా ఎఫెక్ట్: అవార్డులనూ వాయిదావేసిన కోహ్లీ

Submitted on 16 February 2019
virat kohli postponed award giving function


క్రీడాకారులను ప్రోత్సహిస్తూ.. ఆర్పీ-సంజీవ్ గోయెంకా గ్రూప్‌తో కలిసి ఇవ్వనున్న అవార్డుల కార్యక్రమం వాయిదాపడింది. పుల్వామా ఉగ్రదాడికి కొద్దిపాటి విరామంతోనే ఇటువంటి కార్యక్రమాలు చేయడం సబబు కాదని కోహ్లీ పేర్కొన్నారు. పలు క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఆటగాళ్లకు ఏటా కోహ్లీ తన ఫౌండేషన్ ద్వారా ప్రోత్సాహకంగా అవార్డులు అందజేస్తూ ఉంటాడు. ఈ మేరకు కోహ్లీ ట్విటర్‌లో ఈ విషయాన్ని వెల్లడించాడు.

‘ఆర్పీ-ఎస్జీ ఇండియన్‌ స్పోర్ట్స్‌ అవార్డుల కార్యక్రమం వాయిదా పడింది. పుల్వామా ఉగ్రదాడిలో భారత్‌కు భారీ నష్టం సంభవించింది. దీంతో శనివారం జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశాం. ’ అని కోహ్లీ ట్వీట్‌ చేశాడు. అవార్డుల ప్రదానోత్సవం వాయిదాపడినట్లు క్రీడాకారులకు, ప్రముఖులకు సమాచారం అందించారు. 

ముఖ్య అతిథులుగా టీమిండియా టెస్టు స్పెషలిస్టు చతేశ్వర్ పూజారా, లెజెండరీ బాక్సర్ మేరీ కోమ్, స్టార్ షట్లర్ పీవీ సింధులు రానున్నారు. భారత క్రికెటర్లు రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా స్పోర్ట్ మన్ ఆఫ్ ద ఇయర్‌కు నామినేట్ అయ్యారు. భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. 

ఇంకా ఈ జాబితాలో స్మృతి మంధాన, మిథాలీ రాజ్, హర్మన్ ప్రీత్ కౌర్, నేషనల్ హాకీ గోల్ కీపర్ సవితా పూనియా, స్రింటర్ హిమదాస్, స్వప్న బర్మన్, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా, కిదాంబి శ్రీకాంత్, రెజ్లర్ భజరంగ్ పూనియా, షూటర్ సౌరబ్ చౌదరీ, పంకజ్ అద్వానీలు కలిసి మొత్తం 17 విభాగాల్లో అవ్వారులు అందజేస్తారు. ఇందులో లైఫ్ టెైమ్ అచీవ్‌మెంట్ అవార్డు కూడా ఉండటం విశేషం. 

 

 

 

Virat Kohli
cricket

మరిన్ని వార్తలు