కోహ్లి - తారక్ ఓ అవేర్‌నెస్ ప్రోగ్రామ్

Submitted on 19 June 2019
Virat Kohli, Jr.NTR and 7 others was Collaborated for Road and Alcohol Awareness Program

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక ప్రోగ్రామ్ కోసం కలిసి పనిచెయ్యబోతున్నారు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎన్డీటీవీ కండక్ట్ చేస్తున్న రోడ్ అండ్ ఆల్కాహాల్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ కోసం కోహ్లి, తారక్ కలవబోతున్నారు.

అతివేగం వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలు, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కుటుంబాలు రోడ్డున పడడం వంటి విషయాలను దృష్టిలో ఉంచుకుని, ప్రజలకు అవగాహన కల్పించడానికి ఎన్డీటీవీ భారీ ఎత్తున అవేర్‌నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ, పలు రంగాలకు చెందిన సెలబ్రెటీలను ప్రచారకర్తలుగా నియమించుకుంది.

క్రికెట్ రంగంనుండి కోహ్లి, సినిమా రంగంనుండి తారక్ ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొనడానికి అంగీకరించారు. మరో ఏడుగురు సెలబ్రెటీలు కూడా పాల్గొంటారని, త్వరలో అఫీషియల్ ప్రెస్‌మీట్ ద్వారా పూర్తి వివరాలు తెలియచేస్తారని వార్తలు వస్తున్నాయి.

Virat Kohli
Jr.Ntr
Ndtv Road and Alcohol Awareness Program

మరిన్ని వార్తలు