సచిన్ రికార్డు బద్దలుకొట్టిన కోహ్లీ

Submitted on 16 June 2019
Virat Kohli breaks Sachin Tendulkar's world record

మాంచెస్టర్ వేదికగా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ.. టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 57పరుగులు చేయడంతో సచిన్ టెండూల్కర్ 11వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. 

ఈ రికార్డు సాధించడానికి సచిన్ టెండూల్కర్ 276 ఇన్నింగ్స్‌ల సమయం తీసుకోగా విరాట్ కోహ్లీ 222లలోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు. సచిన్‌తో పాటు.. రిక్కీ పాంటింగ్ 286ఇన్నింగ్స్‌లు.. సౌరవ్ గంగూలీ 288ఇన్నింగ్స్‌లు.. జాక్వెస్ కెల్లిస్.. 293 ఇన్నింగ్స్‌లను కోహ్లీ దాటేశాడు. 

వర్షం పడిన తర్వాత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆరంభం నుంచి ఆచితూచి ఆడుతూ వీలు దొరికినప్పుడల్లా బౌండరీలను శాసిస్తూ భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఓపెనర్ రోహిత్ శర్మ(140; 113 బంతుల్లో 14ఫోర్లు, 3సిక్సులు)తో అద్భుతమైన ఇన్నింగ్స్ కనబరిచాడు. 

Virat Kohli
sachin tendulkar
2019 icc world cup
world cup 2019


మరిన్ని వార్తలు