ఇది నిజమేనా! : ఎలిజిబెత్ కంటే సోనియానే ధనవంతురాలు

Submitted on 10 January 2019
Viral post claiming Sonia Gandhi richer than Britain's Queen Elizabeth II is false

సూర్యుడు హస్తమించిన సామ్రాజాన్ని సృష్టించిన ఇంగ్లండ్ రాజవంశీయుల ఆస్తులు ఎంతో తెలుసా.. ఎవరికీ తెలియవు. ఇప్పటికీ వాళ్లు రాచరికంలోనే ఉన్నారు. వారి ఖర్చును ఇంగ్లాండ్ ప్రభుత్వమే భరిస్తోంది. మన కరెన్సీలో అది వేల కోట్లు. అలాంటి ఎలిజిబెత్ రాజవంశీయులను మించిన ధనవంతులు ఇండియాలో ఉన్నారంటే.. ఉన్నారంటోంది సోషల్ మీడియా. వారు ఎవరో కాదు సోనియాగాంధీ. ఏంటీ డౌట్ వచ్చిందా.. ఆశ్చర్యపోయారా.. మీలాగే దేశంలోని అందరూ అవాక్కయ్యారు. ఎలిజిబెత్ ను మించిన ధనవంతురాలు సోనియాగాంధీ ఎలా అయ్యారు.. ఈ కథ వెనక ఏం జరిగింది.. వాస్తవం ఏంటో చూద్దాం..

బ్రిటన్ రాణి ఎలిజిబెత్-11 కంటే యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీనే ధనవంతురాలు అంటూ కొన్నిరోజులుగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ వార్తను బీజేపీ నేత అశ్వనీ ఉపాధ్యాయా సహా పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వార్తను షేర్ చేసిన ఉపాధ్యాయ.. పోస్టును 1500 సార్లుకు పైగా రీట్వీట్ చేయడం గమనార్హం. ఇదే న్యూస్ మరికొంత మంది యూజర్లు పదే పదే షేర్ చేశారు. నిజానికి ఈ వార్త ఆరేళ్ల క్రితం ఓ మీడియా కథనంలో ప్రచురించింది. అప్పటి వార్తను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయిందని, ఇందులో ఎంతమాత్రం నిజం లేదని మీడియా వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే ప్రపంచంలోనే రిచెస్ట్ పొలిటికల్ లీడర్లలో సోనియా గాంధీ 12వ స్థానంలో ఉన్నారని ఇటీవల ఓ మీడియాలో కథనం వచ్చింది.

మరోవైపు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సోనియా గాంధీపై వస్తున్న ఈ వార్త కథనాలపై ప్రతిపక్ష పార్టీలు కూడా తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.2014 లోక్ సభ ఎన్నికల సమయంలో సోనియా గాంధీ.. తన తన వ్యక్తిగత ఆస్తులు విలువ రూ.10 కోట్లు మాత్రమేనని, స్థిరాస్తులు విలువ రూ.2.82 కోట్లుగా అఫడవిట్ లో ప్రకటించారు. ఇక ఎలిజిబెత్ 11 ఆస్తుల విలువ 450 మిలియన్ల డాలర్లు (దాదాపు రూ.3వేల 100 కోట్లు). అంటే సోనియా కంటే ఎలిజిబెత్ అత్యంత ధనవంతురాలనే కదా. ఈ వార్త ఫేక్ న్యూస్ అనమాట. 

Sonia Gandhi
Britain's Queen
Elizabeth II
Viral post
UPA chairperson  

మరిన్ని వార్తలు