హిప్పీ : వైరల్‌గా వైరల్ లిరికల్ సాంగ్

Submitted on 25 May 2019
Viral Full Song Lyrical  from HIPPI Movie

ఆర్ఎక్స్ 100 కార్తికేయ హీరోగా తెలుగ్, తమిళ్‌లో రూపొందుతున్న సినిమా హిప్పీ.. దిగంగనా సూర్యవంశీ జంటగా, వి క్రియేషన్స్ బ్యానర్‌పై, ప్రముఖ తమిళ నిర్మాత కలైపులి ఎస్.థాను నిర్మాణంలో, టి.ఎన్.కృష్ణ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్‌ అండ్ రెండు లిరికల్ సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు ముచ్చటగా మూడో లిరికల్ సాంగ్ రిలీజ్ చేసింది హిప్పీ టీమ్..

'వైరల్' అనే ఈ పాట యూత్‌లో ఫుల్ జోష్ నింపేలా ఉంది. 'మన సెల్ఫీ వైరల్, మన స్మైలే వైరల్, మనమంతా వేసే వేషాలన్నీ వైరల్ వైరల్, మన గోలా వైరల్, మన గొడవా వైరల్' అంటూ మొదలైన ఈ పాటలో.. 'నువ్యు టీవీకెక్కి బూతులు వాగితే వైరల్.. నిను మీ టూ మూమెంట్‌లోకి లాగితే వైరల్'.. వంటి 'వైరల్' లిరిక్స్ క్యాచీగా ఉన్నాయి.. బాలమురళి బాలు కంపోజ్ చేసిన ట్యూన్‌కి అనంత శ్రీరామ్ లిరిక్స్ రాయగా, రఘ దీక్షిత్, విష్ణుప్రియ రవి అండ్ క్రిస్టోఫర్ స్టాన్లీ కలిసి పాడారు. ఎమ్‌సి విక్కీ ర్యాప్ పాడాడు.

జె.డి.చక్రవర్తి, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి కెమెరా : ఆర్.డి.రాజశేఖర్, ఎడిటింగ్ : కె.ఎల్. ప్రవీణ్, డైలాగ్స్ : టి.ఎన్.కృష్ణ, కాశి రాజు, స్టంట్స్ : దిలీప్ సుబ్బరాయన్, కొరియోగ్రఫీ : బృంద, శోభి, ఆర్ట్ : మిలాన్..
 

Karthikeya
Digangana
V Creations
TN Krishna

మరిన్ని వార్తలు