ఫోర్త్ జనరేషన్ ఛాలెంజ్: చైనీస్ ఫన్ కాంటెస్ట్!

Submitted on 8 January 2019
viral 4 Generation Challenge, taking social media by storm?

కొత్త ఏడాదిలో సరికొత్త ఛాలెంజ్ లతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు నాలుగు తరాలకు చెందిన చైనా కుటుంబాలు. బర్డ్ బాక్స్ ఛాలెంజ్ పేరుతో నిర్వహించిన ఈ సరదా ఈవెంట్ లో నాలుగు తరాల కుటుంబ సభ్యులు కలిసి పాల్గొని ఫొటోలకు ఫొజులిచ్చారు. జనవరి నెలలో ఇప్పటివరకూ వైరల్ అయిన ఫొటోల్లో ఫిజి వాటర్ గ్లర్ మెమో తొలి ఫొటోగా నిలిచింది. మరోవైపు చైనాలో నాలుగు తరాలకు చెందిన కుటుంబాల వీడియోలు, ఫొటోలు కొన్నిరోజులుగా ఇంటర్ నెట్ ను షేక్ చేస్తున్నాయి.

నాలుగు తరాల ఛాలెంజ్ లో భాగంగా.. నేటి తరం.. ముందటి తరం వాళ్లని పిలవడం.. వారు ఆ ముందటి తరం వారిని పిలవడం ఇలా ఒకరి తరువాత మరొకరు బయటకు వచ్చి వీడియోలు, ఫొటోలకు ఫొజులిస్తూ సందడి చేశారు. నాలుగు తరాలు కలిసి ఒకచోట కలిసిన వీడియో ప్రస్తుతం సోషల్ ఆన్ లైన్ లో వైరల్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిఒక్కరూ తమ కుటుంబ బాంధవ్యాలను కొనసాగించాలనే ఉద్దేశంతో ఈ సరదా ఛాలెంజ్ కు నిర్వహించినట్టు చైనా కుటుంబాలు చెబుతున్నాయి. ఎంత బాగుందో కదా? మీరూ కూడా చూడండి. 

Fourth Generation
Challenge
social media
Chinese families  

మరిన్ని వార్తలు