మత్తులో లేని అర్జున్ రెడ్డి వెర్షన్‌ 'డియర్ కామ్రెడ్'.. ట్రైలర్ చూశారా?

Submitted on 11 July 2019
Vijay Deverakonda's Dear Comrade Sofar to Arjun Reddy

విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటీస్తూ.. తెరకెక్కుతున్న సినిమా డియర్ కామ్రేడ్. ఈ సినిమా జులై 26వ తేదీన విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించి ట్రైలర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. లేటెస్ట్‌గా విడుదలై టీజర్ యూత్‌ని ఆకట్టుకునే విధంగా ఉంది. భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విజయ్ కెరీర్‌లో సూపర్ హిట్ అయిన అర్జున్ రెడ్డి సినిమా ట్రైలర్ మాదిరే ఆకట్టుకుంటుంది. అయితే అర్జున్ రెడ్డి సినిమాలో ఎప్పుడు కూడా హీరో మత్తులో ఉంటాడు. కోపంగా చాలా అగ్రెసీవ్‌గా కనిపిస్తాడు. అర్జున్ రెడ్డి సినిమా ఓ ప్రేమకథ.

అయితే ఇప్పడు విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న డియర్ కామ్రెడ్ సినిమా ట్రైలర్‌ను చూస్తుంటే.. అర్జున్ రెడ్డి లాంటి కథాంశంతోనే.. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కినట్లు అనిపిస్తుంది. మత్తు లేని అర్జున్ రెడ్డి  వెర్షన్‌‌లా ఉందని అంటున్నారు. విజయ్ దేవరకొండ నటన మాత్రం ఇందులో అదిరిపోయింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన  ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను వైజాగ్‌లో గ్రాండ్‌గా జులై 22న సినిమా నిర్వహించబోతున్నారు. డియర్ కామ్రేడ్ తెలుగుతో పాటు తమిళ్ కన్నడ మలయాళం భాషల్లో ఒకేసారి విడుదల కాబోతోంది.

Vijay Deverakonda
Dear comrade
Arjun Reddy

మరిన్ని వార్తలు