త‌మ్ముడి సినిమా సూపర్ : విజ‌య్ దేవ‌ర‌కొండ

Submitted on 13 July 2019
Vijay Deverakonda Reviews Brother Anand's Dorasani: The Story Was Beautiful To Watch

సెన్షేషనల్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా భరత్ కమ్మా దర్శకత్వంలో నటిస్తున్న మూవీ డియ‌ర్ కామ్రేడ్. ఆ సినిమాను  మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ బ్యానర్స్‌ పై నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి, వై.రవిశంకర్, యష్ రంగినేని నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లో ఆయ‌న డియ‌ర్ కామ్రేడ్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు.

అయితే శుక్రవారం (జులై 12, 2019) విడుదలైన దొరసాని మూవీ మంచి టాక్  తెచ్చుకుంది. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు మంచి ప్రశంసలు అందుతున్నాయి. ఈ చిత్రంలో శివాత్మిక హీరోయిన్ గా న‌టించింది. రాజుగా ఆనంద్‌, దొర‌సానిగా శివాత్మిక అద్భుతంగా నటించారు.  

ఈ సందర్భంగా విజయ్ ఈ సినిమా స‌క్సెస్‌ పై త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించాడు. యంగ్ యాక్టర్స్ ని చూసి గ‌ర్వ‌ప‌డుతున్నాను. మై బాయ్ - ఐ ల‌వ్ యూ సో మ‌చ్. కానీ నీ కంటే రాజునే ఎక్కువగా ఇష్ట‌ప‌డుతున్నాను. శివాత్మిక నీ న‌ట‌న అద్భుతం. సినిమా చూడ‌టానికి అద్భుతంగా ఉంది. ఇంకా కె.వి.ఆర్.మహేంద్ర, ప్రశాంత్ విహారి, సన్నీ కూరపాటి మీరు నిజంగా సూపర్. మీ అందరికీ అల్ దీ బెస్ట్. సినీ లవర్స్ ని ఈ సినిమా మెప్పిస్తుందని ఆశిస్తున్నాను అంటూ త‌న ట్వీట్‌లో తెలిపాడు విజ‌య్.

Vijay Deverakonda
anand
Dorasani Movie
Story Was Beautiful To Watch

మరిన్ని వార్తలు