విన్నర్ ఎవరంటే: కొండచిలువ, మొసలి బిగ్ ఫైట్ చూశారా?

Submitted on 21 February 2019
Video Viral : Terrifying Alligator Vs Python Big Fight

కొండచిలువ.. మొసలి (అలిగేటర్) ఫైటింగ్ సీన్ ఎప్పుడైనా చూశారా? హాలివుడ్ సినిమాల్లో ఇలాంటి ఫైటింగ్ చూసి ఉంటారు. రియల్ గా చూసి ఉండరు. అయితే ఇప్పుడు చూడండి.. ఒకవైపు మొసలి.. మరోవైపు కొండచిలువ బరిలోకి దిగాయి. రెండు బాగా ఆకలితో నకనకలాడిపోతున్నాయి. ఏమాత్రం పట్టుచిక్కిన కొండచిలువకు మొసలి ఫుల్ మీల్స్ అయ్యేది. హోరాహోరీగా మొసలి, కొండచిలువ పోటీపడ్డాయి. బలబలాలు తేల్చుకున్నాయి. ఓడినవారు గెలిచినవారికి ఆహారం కావాలి. అదే గేమ్. తన బలమైన తోకతో మొసలిని చుట్టిపడేయాలని కొండచిలువ ఎత్తులు వేసింది. కొండచిలువ ఎత్తులను చిత్తు చేస్తూ మొసలి తన బలమైన నోటితో తిప్పిపడేసింది.

కొండచిలువకు ఊపిరి ఆడనివ్వలేదు. కొండచిలువకు కొంచెం అవకాశం కూడా అలిగేటర్ ఇవ్వలేదు.చివరికి అలిగేటర్ నే విజయం వరించింది. ఓడిపోయిన 10 అడుగుల కొండచిలువను తన వాడియైన పళ్లతో కొరికి మొసలి మింగేసింది. ఈ డెడ్లీ ఫైట్ జరిగింది ఎక్కడో కాదు.. ప్లోరిడాలోని ఎవర్ గ్లాడ్స్ నేషనల్ మార్క్ షార్క్ లోని వ్యాలీ విజిటర్ సెంటర్ లో జరిగింది. భారీ కొండచిలువను మొసలి మింగేస్తున్నవీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఫ్లోరిడాకు చెందిన రిచ్ కర్గూర్ అనే వ్యక్తి ఈ వీడియోను రికార్డు చేసి, ఫొటోలను కూడా ఫేస్ బుక్ లో పోస్టు పెట్టాడు. ఇదే ఆ వీడియో.. 

Read Also:జెట్ ఎయిర్‌వేస్ విమాన టికెట్‌పై 50 శాతం డిస్కౌంట్
Read Also:కేంద్రం కీలక ఆదేశాలు : బోర్డర్ కు విమానాల్లోనే బలగాల తరలింపు
Read Also:జియో ఎఫెక్ట్ : BSNL డేటా సునామీ ఆఫర్

Alligator
Python fight
National park
Rich kruger

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు