ఒక్క రూపాయికే అంత్యక్రియలు: ఉపరాష్ట్రపతి ప్రశంసలు

Submitted on 21 May 2019
 Vice President Of India prises 1 Rupee Funeral in Telangana

తెలంగాణలోని కరీంనగర్‌లో ఒక్క రూపాయికే అంత్యక్రియలు.. వచ్చినవారికి బోజనాలు పెట్టడం వంటి కార్యక్రమం పెట్టడంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుండగా..  తాజాగా ఇదే అంశంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు. "అంతిమ సంస్కారాలు, ఆయా మత సంప్రదాయాలకు అనుగుణంగా పూజా సామగ్రి అందజేత, 50 మందికి భోజనాలు లాంటివి కేవలం ఒక్క రూపాయికే అందించడం అభినందనీయం. మరణానికి ఇచ్చే ప్రాధాన్యత మానవతకు ప్రతిబింబం. ప్రతి ఒక్కరు వీరిని ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను." అంటూ వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు.

కరీంనగర్‌ నగరపాలక సంస్థ ప్రవేశపెట్టిన ఈ పథకానికి రూ.కోటిన్నర కేటాయించడంపై ట్విటర్‌లో వెంకయ్య కొనియాడారు. మరోవైపు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ కూడా కరీంనగర్‌ మేయర్‌, ఎమ్మెల్యే, కార్పొరేటర్లను ట్విటర్లో అభినందించారు. జూన్ 15 నుంచి అంతిమ యాత్ర‌-ఆఖ‌రి స‌ఫ‌ర్ పేరిట ఈ ప‌థ‌కాన్ని అమ‌ల్లోకి తీసుకొస్తున్నట్లు క‌రీంన‌గ‌ర్ మేయ‌ర్ స‌ర్దార్ ర‌వీంద‌ర్‌సింగ్ వెల్లడించారు.

Vice President Of India
1 Rupee Funeral
Telangana

మరిన్ని వార్తలు