వెంటిలేటర్‌పై ఉన్నారు : కోడి రామకృష్ణ ఆరోగ్యం విషమం

Submitted on 21 February 2019
Veteran Director Kodi Ramakrishna has been Hospitalized-10TV

 ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరారు. కొంత కాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారాయన. ఇంతకుముందు హార్ట్ ఎటాక్, పారాలిటిక్ ఎటాక్ సమస్యలతో పోరాడుతూ, కోలుకున్న కోడి రామకృష్ణ, మళ్ళీ సడెన్‌గా అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ని హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. ప్రస్తుతం కోడి రామకృష్ణ పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్‌పై ఉంచి ట్రీట్‌మెంట్ అందిస్తున్నామని డాక్టర్స్ చెప్పారు. కోడి రామకృష్ణ తెలుగులో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు డైరెక్ట్ చేశారు.

మంగమ్మగారి మనవడు, ముద్దుల మావయ్య, ముద్దుల మేనల్లుడు, శత్రువు, అమ్మోరు, అరుంధతి వంటి సినిమాలు చేశారు. కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. సినీ పరిశ్రమకు చెందిన పలువురు హాస్పిటల్‌కు చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్స్‌ని, కోడి రామకృష్ణ కుటుంబ సభ్యులని అడిగి తెలుసుకుంటున్నారు.

Director Kodi Ramakrishna
Veteran Director Kodi Ramakrishna has been Hospitalized

మరిన్ని వార్తలు