వాల్మీకిగా వరుణ్ తేజ్ న్యూ లుక్ చూశారా?

Submitted on 19 April 2019
Varun Tej Valmiki Movie Shooting Begins-10TV

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, హరీష్ శంకర్  డైరెక్షన్‌లో, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న సినిమా వాల్మీకి.. సిద్దార్థ్, బాబీసింహా తదితరులు నటించగా తమిళ్‌లో సూపర్ హిట్ అయిన జిగర్తండా మూవీకి అఫీషియల్ రీమేక్ ఇది.. ఏప్రిల్ 18 నుండి వాల్మీకి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది.  ఈ సందర్భంగా వాల్మీకి సినిమాలోని తన లుక్‌ని షేర్ చేసాడు వరుణ్ తేజ్. ఒత్తైన జుట్టు, గుబురు గెడ్డంతో సరికొత్త గెటప్‌లోకి మారిపోయాడు వరుణ్.. ఈ మూవీలో తన క్యారెక్టర్‌లో నెగెటివ్ షేడ్స్ ఉంటాయని తెలుస్తుంది.

 

మరో ఇంపార్టెంట్ రోల్ కోసం తమిళ యంగ్ హీరో అధర్వని సంప్రదించనున్నారు. హీరోయిన్‌తో పాటు ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. సినిమాకి కథ : కార్తీక్ సబ్బరాజ్, స్ర్కీన్ ప్లే : మధు, చైతన్య, కెమెరా : అయాంక బోస్, సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఎడిటింగ్ : చోటా కె.ప్రసాద్. ఆర్ట్ : అవినాష్ కొల్ల, ఫైట్స్ : రామ్-లక్ష్మణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : హరీష్ కట్టా. 
Also Read : TMC ప్రచారంలో బంగ్లా యాక్టర్స్: ఇండియా వదిలి పోమ్మంటు కేంద్రం ఆర్డర్స్

Varun Tej
14 Reels Plus
Devi Sri Prasad
Harish Shankar

మరిన్ని వార్తలు