టీఆర్ఎస్‌లో చేరనున్న ఒంటేరు: త్వరలో సండ్ర ?

Submitted on 17 January 2019
Vanteru Pratap Reddy likely to JoinTRS: Shortly comming Sandra

హైదరాబాద్:  రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై పోటీ చేసిన కాంగ్రెస్‌ పార్టీ కీలక నేత ఒంటేరు ప్రతాప్‌ రెడ్డి కారెక్కనున్నట్టు సమాచారం. శుక్రవారం ఒంటేరు టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో ఒంటేరు  రేపు గులాబీ కండువా కప్పుకోనున్నారు. 

2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, 2018లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున గజ్వేల్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రతాప్‌ రెడ్డి పోటీ చేసిన సంగతి తెలిసిందే. తన ప్రత్యర్థి కేసీఆర్‌ చేతిలో రెండు పర్యాయాలు ఓటమి పాలైన ప్రతాప్ రెడ్డి శుక్రవారం టీఆర్ఎస్ పార్టీలో చేరటం రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యింది. 2018  మే నెలలోనే ఒంటేరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ పార్టీలో ఒంటేరుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వనున్నట్లు సమాచారం.

సభకు సండ్ర డుమ్మా!
కాగా,  సత్తుపల్లి నియోజక వర్గం నుంచి టీడీపీ అభ్యర్ధిగా గెలుపొందిన సండ్ర వెంకట వీరయ్య కూడా త్వరలో టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం.  ఈరోజు  శాసనసభలో జరిగిన శాసనసభ్యుల ప్రమాణ స్వీకారానికి సండ్ర గైర్హాజరవటంతో ఆయన  కూడా త్వరలో టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకుంటారని వినికిడి.

TDP
TRS
KCR
Congress
Vanteru Pratap Reddy
Sandra Venkata Veeraiah

మరిన్ని వార్తలు