ఏడుగురు.. మార్చి మూడో వారంలో వస్తున్నారు..

Submitted on 14 February 2019
Valentines Day wishes from Team 7- Movie releases on 21st Mar-10TV

హవీష్, రెహమాన్, నందితా శ్వేత, రెజీనా, అతిథి ఆర్య, అనీషా అంబ్రోస్, పూజిత పొన్నాడ, త్రిథా చౌదరి మెయిన్ లీడ్స్‌గా, థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న సినిమా, సెవన్.. రమేష్ వర్మ పెన్మెత్స..  స్టోరీ, స్ర్కీన్‌ప్లేతో పాటు, నిర్మాతగా వ్యవహరిస్తుండగా, నిజార్ షఫీ ఫోటోగ్రఫీతో పాటు, డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్‌కి రెస్పాన్స్ బాగుంది.. లవర్స్ డే సందర్భంగా, ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, సినిమాని మార్చి 21 న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్..

టీజర్‌లో హవీష్, అమ్మాయిలతో రొమాన్స్ చెయ్యడం, క్రైమ్స్ చేసి తప్పించుకుని తిరగడం, రెహమాన్ అతన్ని పట్టుకోవడానికి ట్రై చెయ్యడం చూపించి, సినిమాపై ఇంట్రెస్ట్ కలిగించారు. ఈ మూవీకి సంగీతం : చైతన్ భరద్వాజ్, డైలాగ్స్ : మహర్షి, లిరిక్స్ : శ్రీమణి, ఎడిటింగ్ : ప్రవీణ్ కె.ఎల్, ఆర్ట్ : గాంధీ

వాచ్ సెవన్ మూవీ టీజర్...
 

7 Telugu Movie
Havish
Regina Cassandra
Nandita Swetha
Ramesh Varma
Nizar Shafi

మరిన్ని వార్తలు