ప్రేమలోపడితే అంతే మరి!

Submitted on 11 February 2019
Valentines Day Specials 2019

ప్రేమలో నిండా మునిగిన వాళ్లు కళ్లలోకి కళ్లుపెట్టుకుని చూసుకుంటే చాలు, వారి మనసులు కూడా ఒకదాని అధీనంలోకి మరొకటి వచ్చేస్తాయట. ప్రేమలో పడినవాళ్లు 3 నిమిషాల పాటు కళ్లల్లోకి కళ్లు పెట్టి చూసుకుంటే వారి గుండెలు ఒకేలా కొట్టుకుంటాయని ఓ పరిశోధనలో తేలింది. 

* ప్రేమలో పడితే తిండీ నిద్రా అన్నీమర్చిపోతారు‌. అయినా మనిషిలో ఎంతో ఉత్సాహం. ఆనందం. ప్రేమ ఎక్కించే మత్తు అలాంటిలాంటిది కాదు మరి.

*ఈడూ జోడూ బాగుందా... అని చూసుకోవడం ముమ్మాటికీ కరెక్టే అంటున్నాయి కొన్ని పరిశోధనలు. ఒకేస్థాయిలో ఆకర్షణ కలిగిన జంట త్వరగా ప్రేమలో పడతారట మరి.

* అచ్చం ఒకేలా లేదా పూర్తిగా భిన్నంగా ఆలోచించే ప్రేమికుల కన్నా, కొన్ని విషయాల్లో ఏకీభవిస్తూ మరికొన్నిటిలో విభేదించే ప్రేమికుల బంధమే ఎక్కువకాలం దృఢంగా ఉంటుందట.   

* ప్రేమలో విఫలమైన వాళ్లు ‘గుండె బద్దలైంది’ అంటుంటారు కదా, ఇష్టమైనవారికి దూరం అయినపుడు నిజంగానే గుండెలో గుచ్చినంత బాధ కలుగుతుందట. ఆ సమయంలో మెదడు విడుదలచేసే కొన్ని రసాయనాలు గుండెను బలహీనం చేస్తాయన్నది పరిశోధకుల మాట. దీన్నే బ్రోకెన్‌ హార్ట్‌ సిండ్రోమ్‌ అంటారు. 

* ప్రేమకు కొన్ని లెక్కలున్నాయి. దాన్నే ట్రయాంగిల్‌ థియరి అంటారు. బంధం, దగ్గరితనం, బాధ్యత... ఈ మూడూ ఉంటేనే ఆ ప్రేమ దృఢంగా ఉంటుందట. 

* ప్రేమలో పడిన అమ్మాయిలు అనుక్షణం అతడి సమక్షాన్నే కోరుకుంటారట. అర్ధరాత్రిదాకా మాట్లాడినా, ‘గుడ్‌నైట్‌ స్వీట్‌డ్రీమ్స్‌’ అంటూ ఫోన్‌ పెట్టేసినప్పట్నుంచీ మళ్లీ మర్నాడు వచ్చే ఫోన్‌కాల్‌ కోసం ఎదురు చూస్తారట. అదే అబ్బాయిలైతే... ‘ఇప్పటిదాకా మాట్లాడాంగా, ఇంకేముంటాయి’ అనుకుంటారట.

Valentines Day Special
Febrauary 14
2019

మరిన్ని వార్తలు