సౌదీలో లవ్వు, గివ్వు అంటే జైలుకే!

Submitted on 11 February 2019
Valentines Day Banned In Soudhi

ప్రేమికుల దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు  కానీ అన్ని దేశాల్లో ఒకే రకంగా ఉండవు. ఒక్కో దేశంలో ఒక్కోలాగా జరుపుకుంటారు. కొన్ని దేశాలు ఫిబ్రవరి 14న కాకుండా, ప్రేమ కోసం ప్రత్యేక దినాలు పాటిస్తున్నాయి.

- జపాన్‌లో: ఫిబ్రవరి 14న అమ్మాయిలే అబ్బాయిలకు గిఫ్టులిస్తారు. మళ్లీ మార్చి 14న అబ్బాయిలు అమ్మాయిలకు నచ్చవి తిరిగివ్వాలి. దీన్ని ‘వైట్ డే’ అంటారు. 
- చైనాలో: ఈ ప్రేమికుల రోజును 7వ నెల 7వ తేదీన క్విజీ ఫెస్టివల్‌గా జరుపుకుంటారు. 
- ఇంగ్లాండ్‌లో: జాక్ వాలెంటైన్ వేషంలో చిన్నారులకు గిఫ్టులు పంచుతారు.
- దక్షిణాఫ్రికాలో: నచ్చిన వ్యక్తుల పేర్లను భుజాలపై హార్ట్ షేపులో పచ్చబొట్టు పొడిపించుకుంటారు. 
- బ్రజిల్‌లో: ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14 కాదు, ఇక్కడ జూన్ 12ను సెయింట్ ‘ఆంటోనీస్ డే’ను ‘డయా డస్ నమోరడస్’ పేరుతో ప్రేమికుల రోజుగా సెలబ్రేట్ చేసుకుంటారు.
- ఫిలిప్పీన్స్‌లో: ప్రభుత్వ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు జరుగుతాయి.  
- ఎస్టోనియాల్లో: ఫిబ్రవరి 14ను స్నేహితుల దినోత్సవంగా జరుపుకొంటారు.

సౌదీ అయితే జైలుకే…
మరికొన్ని దేశాలు ఈ రోజును పూర్తిగా బ్యాన్ చేశాయి. సౌదీ అరేబియాలాంటి దేశాల్లో ఆ రోజు ఎర్ర గులాబీ పట్టుకున్నా చాలు జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందే. మన దేశంలో ప్రేమికుల దినోత్సవం రోజున నచ్చిన వారికి తమ ప్రేమను వ్యక్తం చేస్తారు. గిఫ్టులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ ప్రేమికుల రోజును వ్యతిరేకించే వర్గాలు కూడా కొన్ని ఉన్నాయి. పాకిస్తాన్‌లో కూడా ఇస్లామిక్ పార్టీలు వాలెంటైన్స్ డేను వ్యతిరేకిస్తున్నాయి. అక్కడ కొన్ని నగరాల్లో దీనిని అధికారికంగానే నిషేధించారు. ఫ్రాన్స్‌లో కూడా వాలెంటైన్స్ డే రోజున జరిగే ‘లవ్ లాటరీ’ విద్వేషాలకు దారితీస్తుండడంతో అక్కడి ప్రభుత్వం నిషేధించింది.

Valentines Day
Banned
Soudhi
Pakistan
2019

పుల్వామా దాడి తర్వాత పాకిస్తాన్ పై యుద్ధం చేయాలనే డిమాండ్ పై మీరేమంటారు?

Choices

మరిన్ని వార్తలు