US Open 2019 : 19వ గ్రాండ్ స్లామ్ టైటిల్ దక్కించుకున్న నాదల్

Submitted on 9 September 2019
US Open 2019: Rafael Nadal fights off epic comeback attempt by Daniil Medvedev to win 19th career Grand Slam title

స్పెయిన్ బుల్ గా పేరు తెచ్చుకున్న స్టార్ టన్నిస్ ప్లేయర్ రఫెల్ నాదల్ కెరీర్‌లో 19వ గ్రాండ్‌ స్లామ్ టైటిల్ దక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన 2019 యూఎస్ ఓపెన్  మెన్స్ సింగిల్స్ ఫైనల్స్ లో అద్భుత ప్రదర్శన చేసి డానిల్ మెద్వదేవ్‌పై విజయం సాధించాడు. ఐదుసెట్ల పోరులో  7-5, 6-3, 5-7, 4-6, 6-4తో డానిల్ మెద్వదేవ్‌పై విజయం సాధించాడు.  కొన్నేళ్లుగా కఠోర సాధన చేస్తూ.. అన్ని టోర్నీల్లోనూ సత్తాచాటుతూ వస్తున్న మెద్వెదేవ్‌ కు గ్రాండ్‌ స్లామ్ టైటిల్ గెలవాలన్న కోరిక నెరవేరలేదు.

టైటిల్‌పోరు ఏకంగా సుమారు 5 గంటల పాటు సాగింది. రష్యా క్రీడాకారుడు  మెద్వెదేవ్ నాదల్‌ కు గట్టిపోటీనిచ్చాడు. నాదల్ ఐదు.. మెద్వెదేవ్ 14 ఏస్‌లను సంధించారు. నాదల్ 62.. మెద్వదేవ్ 75 విన్నర్లు కొట్టాడు. మ్యాచ్‌లో అనవసర తప్పిదాలు చేసిన రష్యా ప్లేయర్ మూల్యం చెల్లించుకున్నాడు. నాదల్ 46 తప్పిదాలు చేయగా.. డానిల్ 57 తప్పులు చేశాడు. తొలి రెండు సెట్లను 7-5, 6-3తో గెలుచుకున్న నాదల్‌కు తర్వాతి సెట్లలో రష్యా యువకెరటం డానిల్ భారీ షాకిచ్చాడు. ఒత్తిడిలోనూ గట్టిగా పుంజుకొని ఏకంగా మూడు, నాలుగుసెట్లను 5-7, 4-6తో సొంతం చేసుకున్నాడు.

అంచనాలకు అనుగుణంగానే మ్యాచ్  రసవత్తరంగా సాగింది. అయితే నిర్ణయాత్మక ఐదో సెట్‌లో గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో అపారఅనుభవం కలిగిన నాదల్ 6-4తో పైచేయి సాధించాడు. దిగ్గజ యోధుడికి సమానంగా పోరాడిన మెద్వెదేవ్ పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎంతో పట్టుదలతో, అంకితభావంతో అద్భుత పోరాటం చేశావని కొనియాడుతున్నారు. 

ఫురుషుల విభాగంలో 20 అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో అగ్రస్థానంలో ఉన్న రోజర్ ఫెదరర్ ను అందుకోవడానికి ఒక్క విజయం దూరంలో నిలిచాడు నాదల్. యూఎస్ ఓపెన్‌లో రఫెల్ ఆడటం ఇది ఐదోసారి కాగా.. గతంలో మూడు సార్లు 2017, 2013, 2010లో విజేతగా నిలిచాడు. 2011లో రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. కెరీర్‌లో రఫెల్ మొత్తం 84 టైటిల్స్ నెగ్గగా.. అందులో 21 హార్డ్‌కోర్టులో గెలిచాడు.

US Open 2019
Rafael Nadal
fights off
epic comeback
Daniil Medvedev
19th Grand Slam title
tennis
Spain

మరిన్ని వార్తలు