వివక్ష చూపుతున్నారని పోర్న్ సైట్ల పై కేసు వేసిన చెవిటి వ్యక్తి

Submitted on 19 January 2020
US deaf man files petition against porn websites in new york

పోర్న్ వీడియోలలో సబ్ టైటిల్స్ వేయక పోవటంతోవాటిని ఆస్వాదించలేక పోతున్నామని ఆరోపిస్తూ ఓ దివ్యాంగుడు కోర్టులో కేసు వేశాడు. ఇది తమ హక్కులను కాలరాయటమేనని అతను వితండ వాదనకు దిగాడు.  పోర్న్ సైట్ల్ నిర్వాకంతో వీడియోలను ఆస్వాదించలేక పోతున్నామని తెగ బాధపడిపోతున్నాడు ఆ చెవిటి వ్యక్తి. ఈ మేరకు న్యూయార్క్‌లోని బ్రూక్‌లిన్‌ ఫెడరల్‌ కోర్టులో ఇటీవల పిటిషన్‌ కూడా దాఖలు చేశాడు. 

న్యూయార్క్‌కు చెందిన యారోస్లావ్‌ సూరిస్‌ పుట్టకతోనే చెవిటివాడు. తాము చెవిటివాళ్లం కావడంతో అశ్లీల వీడియోలకు క్యాప్షన్‌ లేకపోవడం వల్ల సాధారణ మనుషుల్లాగా వీడియోను ఎంజాయ్‌ చేయలేకపోతున్నామని తెగ బాధ పడిపోతున్నాడు. పోర్న్‌ వీడియోలు ప్రసారం చేసే పోర్న్ హబ్‌, రెడ్‌ ట్యూబ్‌, యూ పోర్న్ వెబ్‌సైట్లతో పాటు కెనెడియన్‌ పేరెంటింగ్‌ కంపెనీ మైండ్‌ గ్రీక్‌పై సూరిన్ కేసు నమోదు చేశాడు. అంతేగాక ఈ వెబ్‌సైట్లు అమెరికన్‌ వికలాంగుల చట్టాన్ని ఉల్లఘించి తమపై వివక్షతను చూపాయంటూ సూరిస్‌ పిటిషన్‌లో పేర్కొన్నాడు.

పోర్న్‌ వీడియోలకు క్యాప్షన్‌ లేకపోతే దివ్యాంగులు వీడియోను ఎలా చూడగలరు. ఒక సాధారణ మనుషుల్లాగా మేము వీడియోనూ చూడలేమంటూ 23 పేజీల పిటిషన్‌లో సూరిస్‌ తెలిపాడు. పోర్న్‌ వెబ్‌సైట్స్‌లో క్లోజ్‌డ్‌ క్యాప్షన్స్‌ను జత చేయాలని తాను కోరుతున్నట్లు సూరిస్‌ తెలిపాడు. ఇదే విషయమై పోర్న్‌హబ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కోరీ ప్రైస్‌ స్పందిస్తూ.. తమ వైబ్‌సైట్‌లో క్లోజ్‌డ్‌ క్యాప్షన్‌ ఆప్షన్‌ ఉందని, దానిని ఎంచుకోవాలంటే అందులో ఉన్న లింక్‌ను క్లిక్‌ చేస్తే సరిపోతుందని సలహా ఇవ్వటం ఇక్కడ కొసమెరుపు. 

New York
deaf person
Petition

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు