అలర్ట్ : UPSC కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్ రిజల్ట్స్

Submitted on 16 January 2019
UPSC Combined Medical Services Exam 2018 results declared

ఢిల్లీ: UPSC కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్ -2018 రిజల్ట్స్ విడుదలయ్యాయి. అఫీషియల్ వెబ్‌సైట్‌లో upsc.gov.in ఫలితాలు ఉంచారు. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 2018 జులై 22న కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (పార్ట్-1), నవంబర్ 2018- జనవరి 2019 మధ్య నిర్వహించిన పర్సనాలిటీ టెస్ట్ (పార్ట్-2) ఆధారంగా ఫలితాలు వెల్లడించారు.

ఫలితాల కోసం: http://www.upsc.gov.in/sites/default/files/FR-CMSE-2018-Engl.pdf

పోస్టులు, ఎంపికైన వాళ్లు:
* మొత్తం 440 మంది అభ్యర్థులకు నియామకాలు
* అసిస్టెంట్ డివిజినల్ మెడికల్ ఆఫీసర్ (రైల్వే)
* అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ (ఐవోఎఫ్‌హెచ్ఎస్)
* కేంద్ర ఆరోగ్య శాఖలో జూనియర్ స్కేల్ పోస్టులు
* జనరల్ అభ్యర్థులు 218 పోస్టులకు, ఓబీసీ అభ్యర్థులు 207 పోస్టులకు, ఎస్సీ అభ్యర్థులు 10 పోస్టులకు, ఎస్టీ అభ్యర్థులు 5 పోస్టులకు ఎంపికయ్యారు.
* 18 పోస్టుల్లో దివ్యాంగులకు నియామకాలు
* ప్రొవిజినల్ అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన తర్వాతే అపాయింట్‌మెంట్
* మొత్తం 179 మంది అభ్యర్థులు ప్రొవిజినల్ కింద ఎంపిక
* 6 నెలల్లోగా డిక్లరేషన్ ఇవ్వాలి
* డిక్లరేషన్ ఇవ్వని వారి అభ్యర్థిత్వం రద్దు

UPSC
Combined Medical Services Exam 2018 results
declared
UPSC official website

మరిన్ని వార్తలు