పూరిలో ‘ఉప్పెన’ షెడ్యూల్

Submitted on 21 October 2019
Uppena Next Schedule starts in Puri

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘ఉప్పెన’..  మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాతో సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

కృతీ శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నాడు. అక్టోబర్ 21న ‘ఉప్పెన’ కొత్త షెడ్యూల్ పూరిలో ప్రారంభమైంది.

Read Also : రూ. 300 కోట్ల క్లబ్‌లో ‘వార్’

20 రోజులపాటు జరిగే ఈ షెడ్యూల్‌లో పూరితో పాటు కోల్‌కతా, గ్యాంగ్‌టక్ వంటి లొకేషన్లలో షూటింగ్ చేయనున్నారు. ఈ సినిమాకి సగీతం : దేవిశ్రీప్రసాద్, కెమెరా : శాందత్ సైనుద్దీన్, ఎడిటింగ్ : నవీన్ నూలి, ఆర్ట్ : మౌనిక రామకృష్ణ.

Vaishnav Tej
Krithi Shetty
Devi Sri Prasad
Buchibabu

మరిన్ని వార్తలు