జిమ్ మేట్ సానియాను మిస్ అవుతన్న ఉపాసన

Submitted on 15 November 2019
upasana konidela birthday Wishes to Sania Mirza

మెగా పవర్‌స్టార్ రామ్‌ చరణ్ వైఫ్ ఉపాసన, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మంచి ఫ్రెండ్స్ అనే సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ కలిసి ఒకే జిమ్‌లో ఫిట్‌నెస్ కోచ్ పర్యవేక్షణలో కసరత్తులు చేస్తుంటారు. సానియాతో కలిసి తను జిమ్ చేస్తున్న ఫొటోలను ఇంతకుముందు కూడా ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

నవంబర్ 15న సానియా బర్త్‌డే సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెపులుపుతూ ఉపాసన మరో ఫొటోను షేర్ చేశారు. జిమ్‌లో సానియాతో కలిసి జిమ్ చేస్తున్న ఫోటోను షేర్ చేస్తూ ‘హ్యాపీ హ్యాపీ బర్త్‌డే సానియా.. నా ఫిట్‌నెస్ ఇన్‌స్పిరేషన్. వ్యాయామం విషయంలో నాకు స్ఫూర్తి కలిగించినందుకు థ్యాంక్స్. ఈ రోజు నిన్ను మిస్సవుతున్నాను. మళ్లీ త్వరలోనే జిమ్‌లో కలుసుకుందాం’ అంటూ ఉపాసన ట్వీట్ చేశారు.

‘ఉపాసన తన జిమ్ మేట్ సానియాను బాగా మిస్ అవుతోంది పాపం.. త్వరగా వచ్చేయ్ సానియా’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఉపాసన, సానియా కలిసి ఉన్న ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 

Upasana Konidela
sania mirza
Happy Birthday Sania Mirza

మరిన్ని వార్తలు