నటి ఫేస్‌బుక్ ఖాతా పోయింది: రాజకీయాలే కారణమా?

Submitted on 16 April 2019
Unknown miscreants have taken control and blocked my Facebook Account Says Sumalatha

కర్నాటకలోని మాండ్యా నుంచి పార్లమెంటుకు పోటీ చేస్తున్న సినీనటి సుమలత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామిపై విమర్శలు గుప్పించింది. ఆమె ఫేస్‌బుక్ ఖాతాను అధికారపార్టీ నాయకులు బ్లాక్ చేశారని ఆరోపించింది. సుమలత ఫేస్‌బుక్‌ ఖాతా బ్లాక్‌ అవడంతో ఆమె మళ్లీ కొత్తగా ఖాతాను ప్రారంభించారు. ఈ విషయాన్ని సుమలత ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. తన కొత్త ఫేస్‌బుక్‌ ఖాతా లింక్‌ను షేర్‌ చేసిన సుమలత.. తన ఫేస్‌బుక్ పేజ్‌ను లైక్ చేయాలని కోరింది.

ఇదిలా ఉంటే తన ఫేస్‌బుక్ బ్లాక్ కావడానికి కారణం అధికారపార్టీ జేడీఎస్ నేతలే అని సుమలత ఆరోపించింది. జేడీఎస్‌ పార్టీ నేతలు కుళ్లు రాజకీయాలు చేసి, తన ఖాతాను డిలీట్‌ చేశారని, గుర్తు తెలియని వ్యక్తులు తన ఫేస్‌బుక్‌ను వారి అధీనంలోకి తీసుకుని బ్లాక్‌ చేశారని చెప్పింది. కుమారస్వామి మీ జేడీఎస్‌ పార్టీ ఎంత భయంకరమైనదో ఈ ఘటన ద్వారా తెలిసిందని అన్నారు. ఇవి మీ చెత్త రాజకీయాలు అంటూ ఆమె విమర్శించింది.

"ఫేస్‌బుక్‌ ద్వారా నేను మండ్య ప్రజలతో మాట్లాడేదాన్ని, నేను ప్రచారంకు ఎక్కడెక్కడకు వెళ్లే విషయాన్ని పంచుకునేదాన్ని. ఆ పేజ్‌ను కూడా జేడీఎస్ నేతలు బ్లాక్ చేశారు. ఫేస్‌బుక్‌ పేజీని పునరుద్ధరించడానికి మా సాంకేతిక బృందం కృషి చేస్తోంది ఎన్నికల సమయంలో ఇలాంటి చెత్త పనులతో ప్రజలను ఫూల్స్‌ చేసి, వారిని తప్పుదారి పట్టించలేరు." అని సుమలత అన్నారు. ఇది నా కొత్త ఫేస్‌బుక్‌ ఖాతా లింక్‌. కుమారస్వామి మీ జేడీఎస్‌ పార్టీ ఎంత భయంకరమైందో ఈ సంఘటన ద్వారా నిరూపించబడింది. అంటూ ఆమె విమర్శలు చేసింది.


మరిన్ని వార్తలు