HCUలో ఎన్నికల నగారా : 26న పోలింగ్, 27న ఓట్ల లెక్కింపు

Submitted on 18 September 2019
University Of Hyderabad HCU Election: Polling On 26, Counting Votes On 27

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU)లో విద్యార్ధి సంఘం (2019-20) ఎన్నికలకు నగారా మోగింది. మంగళవారం (సెప్టెంబర్ 17, 2019)న స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల చెైర్మన్ శ్రీనివాస్ రావు ఎన్నికల నోటిఫికేషన్ ను విడుదల చేశారు. 

19 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం: 
గురువారం (సెప్టెంబర్ 19) నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతోంది. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయడానికి అవకాశం కల్పించారు. 20 మధ్యాహ్నం 12గంటల వరకు నామినేషన్ల పరిశీలన, పోటీ చేసే వారితో కూడిన తుది జాబితాను విడుదల చేస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు శుక్రవారం 2గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించారు.

అదే రోజు రాత్రి 9 గంటలకు పోటీలో ఉండే వారి జాబితాను విడుదల చేస్తారు. 21 నుంచి 24 వరకు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు, పోలింగ్ ఏజెంట్ల వివరాలను 24న మధ్యాహ్నం 12 గంటల వరకు సమర్పించాల్సి ఉంటుంది. 25న ఉదయం 7గంటల నుంచి ఎలాంటి ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి అవకాశం ఉండదు. 26న ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 27న ఉదయం 9గంటల నుంచి ఓట్ల లెక్కింపును ప్రారంభించి ఫలితాలను ప్రకటిస్తారు. 

> నామినేషన్లను దాఖాలు చేయడానికి స్టూడెంట్స్ వెల్ఫేర్ డిన్ కార్యాలయంలో అవకాశం కల్పించారు. ఇందుకు జనరల్ కేటగిరీ అభ్యర్ధులు రూ.300 డిపాజిట్ చెల్లించాలి. SC, ST అభ్యర్ధులు రూ.150 చెల్లించాల్సి ఉంటుంది.

ఇవీ పదవులు : 
HCU ఎన్నికల్లో అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, సాంస్కృతిక కార్యదర్శి, క్రీడల కార్యదర్శి ప్రధానంగా ఉంటారు. స్కూల్ బోర్డు సభ్యులు, కౌన్సిలర్లు కైడా ఉంటారు. అంతేకాదు యూనివర్సిటీలోని 12 డిపార్టమెంట్లలో ఒక్కో దాని నుంచి ఇద్దరు చొప్పున 24 మందిని స్కూల్ బోర్డు మెంబర్లుగా ఎన్నుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా 12 డిపార్ట్ మెంట్లలో 1A డిపార్ట్ మెంట్ ల నుంచి ముగ్గురు చొప్పున 30 మంది, మరో రెండు డిపార్ట్ మెంట్ల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు కౌన్సిలర్లను విద్యార్ధులు ఎన్నుకోవాల్సి ఉంటుంది.

University Of Hyderabad HCU Election
Polling On 26
Counting Votes On 27

మరిన్ని వార్తలు