ఉబెర్ హెలీకాప్టర్ టాక్సీలు: చార్జీ ఎంతంటే..

Submitted on 15 July 2019
Uber helicopter taxis in America

ఉబెర్ అంతటా నేనే ఉన్నానంటోంది. . హలో అంటే క్షణాల్లో ఇంటి ముంగిట్లో వాలిపోతుంది. ఉబెర్ వచ్చాక ప్రయాణం చాలా ఈజీ అయిపోయింది. ఉబెర్ టాక్సీలు భారత్ లో ఎక్కడ చూసినా కనిపిస్తూనే ఉంటాయి. బైక్,కార్లు సేవలను ప్రజలు బాగా ఉపయోగించుకుంటున్నారు. అక్కడితో ఊరుకోలేదు ఉబెర్ సంస్థ. గాల్లో కూడా తన సేవల్ని అందిస్తోంది. అదే ఉబెర్..హెలికాప్టర్ టాక్సీలు.
Also Read : షాకింగ్ యాక్సిడెంట్ : గాల్లోకి ఎగిరి చెట్టుపై చిక్కిన కారు

న్యూయార్క్ లో ఉన్న మన్ హట్టన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ నుంచి జాన్ ఎఫ్ కెన్నడీ ఎయిర్ పోర్ట్ వరకు హెలికాప్టర్ టాక్సీల సర్వీసులను ఉబెర్ అందిస్తోంది. కాకపోతే  ప్రస్తుతం  ఉబెర్ హెలికాప్టర్ సర్వీసులు ఉబెర్ డైమండ్, ప్లాటీనం కస్టమర్లకు మాత్రమే అందుబాటులోకి ఉన్నాయి. కానీ అతి త్వరలోనే అందరికీ అందుబాటులోకి తెస్తామంటోంది సంస్థ. 

హెలి ఫ్లయిట్ అనే కంపెనీతో డీల్ కుదుర్చుకున్న ఉబెర్ హెలికాప్టర్ సేవల్ని ప్రారంభించింది. రోజుకు 8 నుంచి 10 సర్వీసుల జరుగుతున్నాయి. మాన్ హట్టన్ నుంచి కెన్నడీ ఎయిర్ పోర్టుకు 8 నిమిషాలల్లో చేరుకుంటుంది. ఆ కొద్దిపాటి టైమ్ 15 వేలు (ఇండియా కరెన్సీలో )చార్జ్ చేస్తోంది ఉబెర్. కాగా ఒక హెలికాప్టర్ లో ఐదుగురు ప్రయాణికులు సామర్థ్యం ఉంది. 

అమెరికాలోనే కాక  దేశాల్లోనూ ఉబెర్ హెలికాప్టర్ టాక్సీలను త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఇండియాలో కూడా ఎయిర్ టాక్సీలు వస్తాయనే విషయంలో ఉబెర్ నుంచి ఎటువంటి ప్రకటన ఇప్పటి వరకూ రాలేదు. 
Also Read : జైలులో జ్యోతిష్యం నేర్చుకుంటున్న ఎన్డీ తివారీ కోడలు

america
Uber
helicopter
taxis

మరిన్ని వార్తలు